Mirai : సూప‌ర్ హీరో సినిమాలో మంచు మ‌నోజ్.. గ్లింప్స్ వ‌చ్చేది అప్పుడే..

‘హను-మాన్‌’తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్న‌ తేజ సజ్జ సూపర్‌ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు.

Mirai : సూప‌ర్ హీరో సినిమాలో మంచు మ‌నోజ్.. గ్లింప్స్ వ‌చ్చేది అప్పుడే..

Unveiling the Mighty THE BLACK SWORD from the world of MIRAI on MAY 20th

Mirai – Manchu Manoj : ‘హను-మాన్‌’తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్న‌ తేజ సజ్జ సూపర్‌ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టిస్తున్న సినిమా ‘మిరాయ్‌’. సూపర్ యోధ ఉప శిర్షిక‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రితికా నాయ‌క్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. తాజాగా చిత్ర బృందం మ‌రో అప్‌డేట్‌ను ఇచ్చింది. మంచు మ‌నోజ్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మంచు మ‌నోజ్‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ గ్లింప్స్‌ను ఈ నెల 20న సోమ‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. దీంతో విల‌న్‌గా మంచు మ‌నోజ్ ఎలా ఉంటాడో చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

Devara Song Promo : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. BGM అదిరిపోయిందిగా..


ఇదిలా ఉంటే.. కళింగ యుద్ధం తరువాత యోగిగా మారిన అశోకుడు రహస్యంతో ఈ సినిమా కథాంశం మొదలు కాబోతుంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ గ్రంథాన్ని కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ పాత్రనే తేజ సజ్జ చేయబోతున్నారు.