RGV: రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్.. ఆదిత్య ధర్ పతనం కోసం ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్!
ఆదిత్య ధర పతనం కోసం సినిమా ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తోంది అంటూ సంచలన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ(RGV).
Ram Gopal Varma makes sensational comments about Aditya Dhar.
- సినిమా ఇండస్ట్రీ ఆదిత్య ధర్ పతనం కోరుకుంటోంది
- ఆయన వల్లే రీషూట్స్, నిర్మాతలకు భారీ నష్టం
- దురంధర్ దర్శకుడిపై వర్మ సంచలన కామెంట్స్
RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆదిత్య ధర్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తేసిన వర్మ, అదే సమయంలో పరిశ్రమలో ఆయన పట్ల ఉన్న అసూయను కూడా బయటపెట్టారు వర్మ. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ సినిమా చూసినప్పటి నుండి తాను ఆయనకు పెద్ద అభిమానిని అయిపోయానని అన్నారు వర్మ(RGV).
Mega 158: మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో బిగ్ ట్విస్ట్.. ఆస్కార్ విన్నర్ స్థానంలో మన క్రేజీ కంపోజర్!
ఆదిత్య ధర్ సినిమా మేకింగ్ శైలిని పూర్తిగా మార్చేశారని, ఆయన తీసుకొచ్చిన కొత్త తరహా టేకింగ్ వల్ల టాలీవుడ్లో పలు భారీ యాక్షన్ చిత్రాలు కూడా తమ షూటింగ్‌లను ఆపేసి రీ-షూటింగ్ చేస్తున్నాయని సంచలన కామెంట్స్ చేశాడు వర్మ. దీనివల్ల నిర్మాతలు నష్టపోతున్నారని, అందుకే ఆదిత్య ధర్, ఆయన భార్య యామీ గౌతమ్ పతనం కోసం వారు వేయి కుళ్లుతో ఎదురుచూస్తున్నారని వర్మ పేర్కొన్నారు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇక బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలకు సిద్ధమైంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’తో పాటు విడుదల కావాల్సింది. కానీ, ఆ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో వార్ కి సిద్ధం అయ్యింది. ఈ రెండు భారీ చిత్రాలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
