Nani: క్రేజీ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాని.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్.. అసలు ఎలా సెట్ చేస్తున్నారు ఇలా?
మరో క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథకు ఒకే చెప్పిన నేచురల్ స్టార్ నాని(Nani).
Natural star Nani doing his next film with director Venky Atluri.
- వెంకీ అట్లూరితో నాని మూవీ
- మరో క్రేజీ ప్రాజెక్టుకి రంగం సిద్ధం
- నాగ వంశీ నిర్మాణంలో త్వరలో అధికారిక ప్రకటన
Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రాజెక్ట్‌ల లిస్ట్‌లోకి మరో క్రేజీ కాంబినేషన్ చేరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన ఆసక్తికరమైన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సరికొత్త కథా , కథనాలతో ఉన్న ఈ స్క్రిప్ట్ నానికి కూడా కూడా బాగా నచ్చేసిందట.
త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక నాని(Nani) ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇది హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దీనితో పాటు, ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే మరో విభిన్నమైన చిత్రంలో నాని నటిస్తున్నారు.
Allu Sirish: సినిమాలకు బై బై.. ఇవన్నీ నాకెందుకు.. అల్లు శిరీష్ కామెంట్స్ వెనుక ఉన్న అర్థం ఏంటి?
ఈ రెండు సినిమాలు పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతే వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే, 2026 ద్వితీయార్ధంలో లేదా ఆ తర్వాతే ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే భారీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే నాని సినిమా పనులను ప్రారంభించనున్నారు వెంకీ అట్లూరి. నాని అంటే సహజ సిద్ధమైన నటనకు, వెంకీ అట్లూరి మార్కు ఎమోషనల్ అండ్ క్లాస్ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి నాని చేస్తున్న ఈ క్రేజీ లైనప్ చూస్తుంటే రాబోయే రెండేళ్లూ ఆయన బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
