Dirty Fellow Trailer : ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ఠ లాంచ్ చేసిన.. ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ చూశారా?

తాజాగా డర్టీ ఫెలో ట్రైలర్ ని విడుదల చేశారు.

Dirty Fellow Trailer : ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ఠ లాంచ్ చేసిన.. ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ చూశారా?

Dirty Fellow Movie Trailer Launched by Director Vassishta Mallidi

Updated On : May 17, 2024 / 6:26 PM IST

Dirty Fellow Trailer : శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో, హీరోయిన్స్ గా, సత్యప్రకాష్, నాగినీడు ముఖ్య పాత్రల్లో గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై GS బాబు నిర్మాణంలో ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డర్టీ ఫెలో’. మే 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా డర్టీ ఫెలో ట్రైలర్ ని విడుదల చేశారు.

Also Read : Mirai : సూప‌ర్ హీరో సినిమాలో మంచు మ‌నోజ్.. గ్లింప్స్ వ‌చ్చేది అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు మల్లిడి వశిష్ఠ చేతుల మీదుగా డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. మాఫియా చుట్టూ తిరిగే కథలా ఉంది. మీరు కూడా డర్టీ ఫెలో ట్రైలర్ చూసేయండి..

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో హీరో శాంతిచంద్ర, డైరెక్టర్ మూర్తి సాయి అడారి, పలువురు మూవీ యూనిట్ పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో ట్రైలర్ చూసాను. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. హీరో శాంతిచంద్ర, డైరెక్టర్ మూర్తి సాయి మాట్లాడుతూ.. మా డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి మమ్మల్ని అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదాలు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.

Dirty Fellow Movie Trailer Launched by Director Vassishta Mallidi