Ram Pothineni : మెగా ఫోన్ పట్టబోతున్న హీరో రామ్ పోతినేని ?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మెగాఫోన్ పట్టబోతున్నాడనే టాక్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తుంది.
Gossip Garage Is Hero Ram Pothineni will become a Director
Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మెగాఫోన్ పట్టబోతున్నాడనే టాక్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తుంది. ఇటీవల విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ ఓ పాటకు స్వయంగా లిరిక్స్ రాశాడు. నువ్వుంటే చాలే అనే సాంగ్‌కు ఆయన లిరిసిస్ట్. ఆ పాట ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది. ఇది ఆయన క్రియేటివ్ ట్యాలెంట్‌ను బయటపెట్టింది. ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తానే స్టోరీ రాసుకుని, దాన్ని తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేస్తున్నట్టు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వరుస ఫ్లాప్‌లతో కాస్త ఇబ్బంది పడిన రామ్, ఇప్పుడు తన కెరీర్‌ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేందుకు ఫుల్ ఫోకస్ పెట్టాడట. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో, ఆయన స్వయంగా ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాడని, దానికి సరైన డైరెక్టర్‌ను వెతుకుతున్నాడని అంటున్నారు.
Ustaad bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్.. పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..
ఓ సినిమా తీయాలని అయితే రామ్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు రెడీ చేసుకున్న స్టోరీకి తానే డైరెక్టర్‌గా చేయాలా.? లేకపోతే డెబ్యూ డైరెక్టర్‌తో చేయించాలా అని ఆలోచిస్తున్నట్టు టాక్. మార్చి లేదా ఏప్రిల్‌లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని, షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోందని అంటున్నారు.
అయితే రామ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడని మరి కొందరు చెబుతున్నారు. తానే స్టోరీ రాసుకుని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. రామ్ తన స్టోరీని తానే డైరెక్ట్ చేస్తాడా.? లేక ఎవరికైనా ఇచ్చి, నటుడిగా మాత్రమే ఫోకస్ చేస్తాడా.? లేదా ప్రొడ్యూసర్‌గా మారి డెబ్యూ డైరెక్టర్‌తో చేయిస్తాడా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే రామ్ స్టోరీ-డైరెక్షన్ వైపు వెళ్తున్నాడనే టాక్ మాత్రం ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. రామ్ పోతినేని మెగా ఫోన్ పడుతాడో లేదో చూడాలి మరి.
