హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో, ఆర్టీసీ సంస్థలు కీలక నిర్ణయం

హైదరాబాద్ వాసులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ఒకపక్క మెట్రో, మరోపక్క గ్రేటర్ ఆర్టీసీ దృష్టిసారించింది.

Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఒకపక్క మెట్రో, మరోపక్క గ్రేటర్ ఆర్టీసీ దృష్టిసారించింది. ప్రయాణీకులకు ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సోమ, శుక్రవారాలు మెట్రోరైలు వేళల్లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రోరైలు 11గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాల పాటు పొడిగించారు. దీంతో చివరి మెట్రోరైలు టర్మినల్ స్టేషన్లు ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45కు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. రాత్రి 12.45 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. అదేవిధంగా సోమవారం ఉదయం మెట్రోరైలు వేళల్లో సంస్థ మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రతీరోజూ ఉదయం 6గంటల నుంచి మెట్రోరైళ్లు బయలుదేరుతాయి. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రోరైళ్లు ఆయా స్టేషన్ల నుంచి ప్రారంభం కానున్నాయి.

Also Read : డేంజర్ బెల్స్ మోగిస్తున్న హోర్డింగ్స్..! ముంబై ఘటనతో హడలిపోతున్న హైదరాబాద్ సిటీ జనం

నగరంలోని ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోరైలు లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటి ప్రకారం బస్సులు నడపాలని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా రెండుమార్గాలను ఎంచుకుంది.  సికింద్రాబాద్ – మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47ఎల్ పేరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222 ఎల్ (లింగంపల్లి – కోఠి) బస్సులకుసైతం సమయాలను నిర్దేశించారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 నిమిషాలకో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Also Read : Best Flagship Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ 2024 మేలో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ప్రయోగాత్మకంగా నడిచే 47ఎల్ బస్సులను రెండు రూట్లలో గ్రేటర్ ఆర్టీసీ నడుపుతుంది.
– సికింద్రాబాద్ – మణికొండ మధ్య నడిచే 47ఎల్ బస్సు తెల్లవారు జామున 4గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి సర్వీసు బయలుదేరుతుంది. మణికొండ నుంచి ఇదే బస్సు ఉదయం 5.15గంటలకు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 10గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్ – మణికొండకు రాత్రి 11.15గంటలకు చేరుకొని తిరిగి సికింద్రాబాద్ బయలుదేరుతుంది.
– కోఠి- లింగంపల్లి మధ్య కూడా 222 ఎల్ రూటు బస్సులు తెల్లవారు జాము నుంచి రాత్రి 11గంటల వరకూ ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు