Priyanka Gandhi: నా తల్లిదండ్రులను, సోదరుడిని కించపర్చారు.. అయినప్పటికీ..: ప్రియాంకా గాంధీ

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తన కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఘోరంగా అవమానించారని, అయినా తాము మౌనంగా ఉన్నాయని ప్రియాంకా గాంధీ చెప్పారు.

Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్లో ఇవాళ నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆమె మాట్లాడారు. తన సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో తన తండ్రి రాజీవ్ గాంధీని కూడా అవమానపర్చేలా మాట్లాడారని, తన సోదరుడు, అమర వీరుడి కుమారుడు రాహుల్ గాంధీని మిర్ జాఫర్, ద్రోహి అని అన్నారని చెప్పారు.

బీజేపీ నేతలు తన తల్లి సోనియా గాంధీనీ కించపర్చేలా మాట్లాడారని వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ప్రియాంకా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీని ఓ బీజేపీ ముఖ్యమంత్రి మరింత కించపర్చుతూ మాట్లాడారని, రాహుల్ కి తండ్రి ఎవరో కూడా తెలియదని అన్నారని చెప్పారు. ఇంతలా కించపర్చేలా మాట్లాడినా వారిపై చర్యలు ఏవీ తీసుకోలేదని అన్నారు.

పార్లమెంట్లో అటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ బీజేపీ నేతలపై లోక్ సభ, రాజ్యసభ నుంచి అనర్హత వేటు వేయలేదని ప్రియాంకా గాంధీ చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనకుండా వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. తమ కుటుంబాన్ని చాలా సార్లు కించపర్చారని, అయినప్పటికీ తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. కాగా, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

Vundavalli Sridevi : నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళాను హైదరాబాద్..

ట్రెండింగ్ వార్తలు