SRH vs RR : పోరాడి ఓడిన రాజ‌స్థాన్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

SRH vs RR : ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 202 లక్ష్య ఛేదనలో రాజస్థాన్ పోరాడి ఓడింది.

SRH vs RR : ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 202 లక్ష్య ఛేధనలో చివరి వరకు పోరాడిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఓటమి పాలైంది. యశస్వి జైస్వాల్ (67; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్), రియాన్ పరాగ్ (77; 49 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్స్) హాఫ్ సెంచరీలతో విజృంభించారు.

మిగతా ఆటగాళ్లలో రోవ్మాన్ పావెల్ (27), షిమ్రాన్ హెట్మెయర్ (13), ధృవ్ జురెల్ (1), రవిచంద్రన్ అశ్విన్ (2 నాటౌట్) పరుగులకే పరిమితమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఏకంగా (3) వికెట్లు తీసుకోగా, కెప్టెన్ పాట్ కమిన్స్, టి.నటరాజన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. రాజస్థాన్ పతనాన్ని శాసించిన భువనేశ్వర్ కుమార్(3/41)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అగ్రస్థానంలో రాజస్థాన్ :
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 2 ఓడి మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 4 ఓడి 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.

బ‌ట్ల‌ర్, శాంస‌న్ డ‌కౌట్‌..
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి మార్కో జాన్సెన్ క్యాచ్ అందుకోవ‌డంతో జోస్ బ‌ట్ల‌ర్ (0) ఔట్ కాగా.. ఐదో బంతికి సంజూ శాంస‌న్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 1 ఓవ‌ర్‌కు రాజ‌స్థాన్ స్కోరు 1 2. రియాన్ ప‌రాగ్ (0), య‌శ‌స్వి జైస్వాల్ (1) లు ఆడుతున్నారు.

రాజ‌స్థాన్ టార్గెట్‌.. 202
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు దంచికొట్టారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో నితీశ్ రెడ్డి (76 నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాద‌గా ఆఖ‌ర్లో హెన్రిచ్ క్లాసెన్ (42 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

నితీశ్ రెడ్డి హాఫ్ సెంచ‌రీ
అశ్విన్‌ బౌలింగ్‌లో సింగిల్ తీసి 30 బంతుల్లో నితీశ్ రెడ్డి అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి.


ట్రావిస్ హెడ్ ఔట్‌
దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ను అవేశ్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 14.4వ ఓవ‌ర్‌లో 131 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది.


చాహ‌ల్ ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు
13వ ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో నితీశ్ రెడ్డి రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాద‌డంతో ఈ ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 113/2. ట్రావిస్ హెడ్ (50), నితీశ్ రెడ్డి (42) లు క్రీజులో ఉన్నారు.

ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ..
ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 37 బంతుల్లో ట్రావిస్ హెడ్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 12 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 92/2. ట్రావిస్ హెడ్ (50), నితీశ్ రెడ్డి (22) లు క్రీజులో ఉన్నారు.

10 ఓవ‌ర్లకు స‌న్‌రైజ‌ర్స్ 76/2
స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవ‌ర్లు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 76/2. నితీశ్ రెడ్డి(12), ట్రావిస్ హెడ్ (44) లు క్రీజులో ఉన్నారు.

అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్ ఔట్‌..
స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవ‌డంతో అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్ (5) ఔట్ అయ్యాడు. దీంతో 5.1వ ఓవ‌ర్‌లో 35 పరుగుల వ‌ద్ద హైద‌రాబాద్ రెండో వికెట్‌ కోల్పోయింది. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 37/2. ట్రావిస్ హెడ్ (17), నితీశ్ రెడ్డి(1) క్రీజులో ఉన్నారు.

అభిషేక్ శ‌ర్మ ఔట్‌..
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. అవేశ్ ఖాన్ త‌న‌ బంతికే అభిషేక్ శ‌ర్మ (12)ను ఔట్ చేశాడు. దీంతో 4.1వ ఓవ‌ర్‌లో 25 ప‌ర‌గుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

రాజస్థాన్ తుది జ‌ట్టు :
యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, రోమాన్‌ పోవెల్‌, షిమ్రాన్‌ హెట్‌మెయర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్‌ శర్మ

హైదరాబాద్‌ తుది జ‌ట్టు :
ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌రెడ్డి, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సెన్‌, పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), భువనేశ్వర్‌కుమార్‌, టి. నటరాజన్‌

 


ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ క‌మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు