Ravi Shastri : ఫ్రీ అయ్యా..హ్యాపీగా మందు కొడదాం రండి..మీమ్స్ క్రియేటర్స్ కు రవిశాస్త్రి పిలుపు

తనను ట్రోల్ చేసే మీమర్స్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘సరదాగా మందు కొడతాం రండి’ అంటూ ఆహ్వానించారు.

Ravi Shastri comments on memes creators : ‘మీమ్స్ క్రియేటర్స్ గ్రేట్..అంటూనే క్రికెట్ దిగ్గజం..మాజీ టీమిండియా కోచ్ రవిశాస్త్రి మెచ్చుకుంటునే స్వీట్ స్వీట్ గా చురకలు కూడా అంటించారు మీమర్స్ పై.టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి పదవీవిరమణ చేశాక మీమర్స్ కు రవిశాస్త్రి ఆహ్వానం పలికారు. ‘నేను ఫ్రీ అయ్యా..మీమర్స్ కమ్..సరదాగా మందు కొడదాం రండీ’ అంటూ ఆహ్వానం పలికారు. రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో మీమర్స్ క్రియేట్ చేసిన మీమ్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అంతకంటే వైరల్ అవుతోంది మీమర్స్ కు రవిశాస్త్రి మందు పార్టీ ఆహ్వానం..

Read more : T20 world cup 2021..Sania Mirza : షోయబ్ మాలిక్ సిక్సర్లు..సానియా చప్పట్లు..ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఇటీవల టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేసారు రవిశాస్త్రి. ఒకే ఓమర్ లో ఆరు సిక్సులు కొట్టిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన రవిశాస్త్రి చాలా సరదగా మనిషి అని అంటుంటారు. అందరితోనూ కలివిడిగా ఉండే ఆ నైజమే రవిశాస్త్రిని టీమిండియా కోచ్ గా ఇన్నేళ్ల పాటు కొనసాగేందుకు కారణమైందని ప్రముఖులసైతం అంటుంటారు. ఎంత గొప్పవారిపైనైనా సరే మీమ్స్ తో సెటైర్లు వేసే నెటిజన్లు రవిశాస్త్రి మాత్రం ఎందుకు వదులుతారు? ఆయనపై మీమ్స్ సెటైర్లు, ఛలోక్తులు ఇలా ఎన్నో వేశారు. అలా సోషల్ మీడియాలో రవిశాస్త్రిపై వచ్చిన మీమ్స్ కు లెక్కేలేదు.

ముఖ్యంగా టీమిండియా ఓడిపోయిన సమయాల్లో శాస్త్రిని టార్గెట్ చేసి వచ్చిన మీమ్స్ లెక్కలేనన్ని. మీమ్స్ తో ట్రోలింగ్ మామూలుగా ఉండదు. శాస్త్రిపై వచ్చే మీమ్స్ లో చాలావరకు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఈక్రమంలో రవిశాస్త్రి జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనపై వచ్చే మీమ్స్ ను తాను కూడా ఎంజాయ్ చేస్తుంటానని..తనపై కామెడీ చేస్తూ వచ్చే మీమ్స్ పట్ల అభ్యంతరం చెప్పబోనని..అటువంటి మీమ్స్ చూసి విపరీతంగా నవ్వుకుంటానని నాకుండే టెన్షన్లు నా పై వచ్చే ట్రోలింగ్ మీమ్స్ రిలాక్స్ చేస్తుంటాయని తెలిపారు.

నాకు మనసు బాగుండకపోతే మీమ్స్ ద్వారా మీమ్ క్రియేటర్స్ చక్కగా నవ్విస్తుంటారని.. మీమ్స్ రూపొందించడం కూడా ఓ కళే. వాళ్లలో కొందరితో సరదాగా మందు కొట్టాలనుంది” అంటూ సరదాగా తన మనోభావాలను పంచుకున్నారు రవిశాస్త్రి. నిజమే మరి కాస్త శృతి మించినా మీమ్స్ తో ట్రోలింగ్స్ మామూలుగా ఉండవు. దటీజ్ మీమ్స్ క్రియేటర్స్. రవిశాస్త్రి అన్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేయాలంటే క్రియేటివిటీ ఉండాల్సిందే.

Read more : Sania Mirza : ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

రవిశాస్త్రి ఆటగాళ్లతో సులభంగా కలిసిపోతాడు. ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు! ఒకసారి ధర్మశాల టెస్టులో టీమ్‌ఇండియా చిత్తుగా ఓడిపోయిన సందర్భంలో మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లను శాస్త్రి పిలిచాడు. ఇక వాయించేస్తాడని అనుకున్నారు టీమ్ అంతా. కానీ వారి అంచనాలు తల్లక్రిందులు చేశాడు శాస్త్రి. వారితో అంత్యాక్షరి ఆడించారు. రాత్రి 2 గంటల వరకు ధోనీ హిందీపాటలు పాడుతూ గడిపారు. ఇలా వారిలో టెన్షన్ పోగోట్టారు. అది టీమిండియాలో ఉత్సాహాన్ని నింపింది. మహ్మద్‌ షమీ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడ్డప్పుడూ అతడి ఫోకస్‌ను క్రికెట్‌వైపు మలిపిన ఘతన శాస్త్రితేనంటారు టీమిండియా ఆటగాళ్లు. ఏం సయంలో ఎలా ఉండాలో..ఆటపై ఏకాగ్రత ఎలా పెట్టాలో నేర్పిచారని..శాస్త్రి మాటలు ఎవరినైనా సరే మంత్రముగ్ధుల్ని చేస్తాయని సహచరులు అంటుంటారు. కుర్రాళ్లలోని అసలు సిసలు బలాన్ని గుర్తించి మెరుగులు దిద్దడంలో శాస్త్రి మేటి! ఆయనకెవరు రారు సాటి అంటారు.

ట్రెండింగ్ వార్తలు