ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అతి త్వరలో అమలు చేస్తాం.

Free Bus Travel : ఏపీలో ఉచిత బస్సు స్కీమ్ పై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆయన తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు స్కీమ్ పై అధ్యయనం చేస్తామని మంత్రి వెల్లడించారు. స్కీమ్ అమలవుతున్న తీరు, లోటుపాట్లపై స్టడీ చేస్తామన్నారు.

”ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అతి త్వరలో అమలు చేస్తాం. ఆ స్కీమ్ ద్వారా మహిళల కళ్లలో ఆనందం చూసేందుకు మా ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఈ పథకాన్ని పెట్టింది. ఏపీలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు.. మనం పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణలో ఏ విధంగా అమలవుతోంది? అక్కడ ఏమైనా పొరపాట్లు, లోటుపాట్లు జరుగుతుంటే అవన్నీ మేము ఒకసారి సమీక్షించుకుని మన రాష్ట్రంలో చేపట్టేనాటికి వందశాతం పారదర్శకతతో, ఏ విధమైన సమస్యలు లేకుండా, ఎవరికీ కష్టం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రవాణ శాఖ క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Also Read : పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు