పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?
ఎక్కడా పొరపచ్చాలు రాకుండా.. కలసి నడుస్తున్నారు ఇద్దరు నేతలు.

ఒకరంటే ఒకరికి గౌరవం. పైగా ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని బాధ్యతగా పనిచేయాలనే తపన. చంద్రబాబు, పవన్ ద్వయం ఇప్పుడు ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. నవ్యాంధ్రలో కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు స్పెషల్ ఫోకస్‌తో పనిచేస్తున్నారు నేతలు. అధికారం వచ్చిందని పవర్‌ను ఎంజాయ్ చేస్తామంటే కుదరదంటూ క్యాడర్, లీడర్లకు చెప్పిన పవన్ కల్యాణ్.. తాను కూడా అక్షరాల అదే ఫాలో అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా.. తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.
పవన్ చంద్రబాబు దోస్తీ ఒక్కరోజుతో మొదలు కాలేదు. అప్పటితోనే అయిపోదు. ఎన్ని విమర్శలు వచ్చినా..ప్యాకేజీ స్టార్ అని విమర్శించినా, చంద్రబాబుకు బానిస అని ఎద్దేవా చేసినా.. ఎక్కడా తగ్గలేదు పవన్ కల్యాణ్. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు చంద్రబాబు మాత్రమేనని నమ్మారు పవన్ కల్యాణ్.
విమర్శలు వచ్చినా..
అందుకే వ్యక్తిగతంగా తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. బాబుతోనే కలసి నడిచారు. సీట్ల విషయంలోనూ కాంప్రమైజ్ అయి పనిచేశారు. ఇద్దరు కలసి వైసీపీని అధికారం నుంచి దించడం కోసం కమిట్‌మెంట్‌తో, కలిసి పనిచేసిన నాయకులు. వారి అజెండా, ఎజెండా ఒక్కటే కావడంతో వాళ్ల ఆలోచనలు, ఒకరంటే ఒకరు గౌరవించుకునే విధానం ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది.
ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలోనూ చంద్రబాబును.. శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణే ప్రతిపాదించారు. ఆయనలాంటి ముందు చూపున్న వ్యక్తి ఏపీ అభివృద్ధికి చాలా ముఖ్యమని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు పవన్.
అదే మీటింగ్‌లో చంద్రబాబు చేతిని పట్టుకుని విడిచి పెట్టుకుండా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు పవన్. బాబు నలిగిపోయారని..అవమానాలకు గురయ్యారని.. జైలులో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే..తానే భువనేశ్వరికి ధైర్యం చెప్పానన్నారు పవన్.
నిజానికి రాజమండ్రి జైలులో చంద్రబాబును కలసి బయటికి వచ్చి పవన్ మాట్లాడిన మాటలు ఏపీ ప్రజలను ఆలోచింప చేశాయి. ముమ్మూటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పనిచేస్తాయని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ పవన్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.
ఇక అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తారు చంద్రబాబు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నవారు..11సీట్లకే పరిమితం అయ్యారని చెప్పారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో.. తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొనియాడారు చంద్రబాబు.
వయస్సులో చిన్నవాడైనా..
ఇలా ఎవరినీ ఎవరు తక్కువ చేసుకోకుండా.. ఇద్దరిలో ఏ ఒక్కరు కమిట్‌మెంట్‌తో పనిచేయక పోయినా ఇంతటి విజయం దక్కేది కాదని తెలుసుకున్న నేతలు.. కలసి పనిచేస్తున్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారు. వయస్సులో చిన్నవాడైనా.. తనంత రాజకీయ అనుభవం లేకపోయినా.. పవన్ కల్యాణ్ ను అమితంగా ప్రేమిస్తూ.. గుండెలకు హత్తుక్కొని గౌరవిస్తున్నారు చంద్రబాబు. అలాగే, చంద్రబాబు ఎంటైర్ పొలిటికల్ కెరీర్‌లో..ఆయన ఇంతలా అభిమానించి..గౌరవించే నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే కావొచ్చు.
క్యాబినెట్ విస్తరణలోనూ పవన్ కల్యాణ్‌కు పెద్దపీట వేశారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడంతో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీశాఖల వంటి కీలక పోర్ట్ ఫోలియోస్ అప్పగించారు. జనసేన నుంచి గెలిచిన 21మంది ఎమ్మెల్యేల్లో పవన్‌తో సహా ముగ్గురిని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు చంద్రబాబు.
ఎక్కడా పొరపచ్చాలు రాకుండా.. కలసి నడుస్తున్నారు ఇద్దరు నేతలు. పవన్ కల్యాణ్ కూడా బాబుపై అమితమైన గౌరవం చూపిస్తున్నారు. ముందు నుంచి వయస్సులో పెద్దవారంటే పవన్‌కు చాలా గౌరవం. వాళ్ల హోదా, ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేకుండా..వయస్సుకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు పవన్. చంద్రబాబును కూడా ముందు నుంచి బాగా గౌరవిస్తూ వస్తున్నారు పవన్. ఆయన ముందుచూపు, అభివృద్ధిపై విజన్‌కు బాగా అట్రాక్ట్ అయ్యానని పవన్ కల్యాణే చాలా సార్లు చెప్పారు.
Also Read: రూ.325 కోట్లతో పనులు… డిసెంబరులోపు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి