మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం, మా రాష్ట్రానికి భారీగా నిధులు ఇవ్వాల్సిందే- కేంద్రానికి ఏపీ ప్రభుత్వం డిమాండ్

వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.

AP Demand For Funds : కేంద్రానికి ఫుల్ సపోర్ట్ గా ఉన్న రాష్ట్రానికి బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేసింది ఏపీ సర్కార్. కొత్త రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీకి నిధులు పెంచాలని కోరుతోంది. గతంలో ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడున్న పరిస్థితులు వేరని, అధిక సీట్లు ఇచ్చిన రాష్ట్రంగా ఏపీని గుర్తించి, ఆ స్థాయిలో నిధులు రాబట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

ఇందులో భాగంగా కేంద్రం ముందు భారీ చిట్టాను పెట్టింది. రాష్ట్ర ఆకాంక్షలు, ప్రభుత్వ ప్రయత్నాలకు చేయూతనిచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది ఏపీ సర్కార్. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం.. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మోదీ సర్కార్ పై రాష్ట్ర సర్కార్ గుర్తు చేసింది. ఇందుకోసం 5 ప్రధాన అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. రాష్ట్రం తరుపున కేంద్రానికి అందిన 5 ప్రధాన అంశాల్లో ఒకటి ఏపీ అభివృద్ధికి భారీ ఆర్థికసాయం. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో దీని నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం రంగంలోకి దిగాల్సిందేనంటూ ఏపీ నేతలు స్పష్టం చేశారు.

ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను నవ్యాంధ్ర కోల్పోవడం, విభజన తర్వాత వచ్చిన అప్పుల భారమే ఆర్థిక సంక్షోభానికి కారణం అన్నారు. మూలధన వ్యయాన్ని ఉత్పాదకంగా ఖర్చు చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పన ద్వారా ఏపీని పునర్ నిర్మించాలని కేంద్రానికి విజ్ఞప్తి పెట్టారు. ఇప్పటివరకు ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాల కోసం వచ్చే బడ్జెట్ లో రూ.15వేల కోట్ల గ్రాంటు కేటాయించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఏపీకి వరదాయినిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేసేందుకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి పెట్టారు రాష్ట్ర నేతలు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని రాష్ట్ర విభజన సమయంలోనే గుర్తించనందున ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని నిర్మలను కోరారు.

ఇక ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం పెద్ద మనసుతో ఆలోచించాలని రాష్ట్ర నేతలు సూచించారు.

Also Read : పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు