పండగపూట మందుబాబులకు షాక్.. మద్యం బాటిళ్ల ధరలు పెరిగాయ్
బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.
Liquor (Image Credit To Original Source)
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
- ఎంఆర్పీ రూ.99 ఉన్న వాటికి మినహాయింపు
- మిగతావాటికి రూ.10 చొప్పున పెంపు
మందుబాబులకు షాక్. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బాటిళ్లపై రూ.10 చొప్పున ధర పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఎంఆర్పీ రూ.99 ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతావాటికి రూ.10 చొప్పున పెంచింది.
దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.
Also Read: వెనెజువెలా అధ్యక్షుడిని నేనే.. తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
ఐఎంఎఫ్‌ఎల్‌తో పాటు ఫారిన్ లిక్కర్‌కు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అలాగే, వైన్స్ షాపుల లైసెన్సీలకు ఇచ్చే లాభాన్ని ఒక శాతం పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలంటూ బార్ల యజమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అప్పటికప్పుడు బీరు తయారుచేసి అమ్మే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల ఐదు కి.మీ. పరిధి వరకు త్రీస్టార్ లేదా అంతకంటే పెద్ద హోటళ్లలో మైక్రోబ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు.
