కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
గత ఏడాది నవంబర్ 1న కార్తీక మాసం ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగి ఇక్కడ తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Kasinbugga (Image Credit To Original Source)
- పలాసలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం
- గత ఏడాది ఇక్కడే తొక్కిసలాట, 9 మంది మృతి
- ఇప్పుడు వెండి, బంగారు నామాలు, నగదు మాయం
Kasibugga: శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గత ఏడాది నవంబర్ 1న కార్తీక మాసం ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగి ఇక్కడ తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ తర్వాతి నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం మూసి ఉంటోంది. ఆలయ యజమాని హరి ముకుంద పండా ఆధ్వర్యంలో ఏకాంతంగా స్వామి వారికి సేవలు జరుగుతున్నాయి. అయితే, స్వామివారి ఆలయం నుంచి వెండి, బంగారు నామాలు, మూడు హుండీల్లోని నగదును దొంగలు చోరీ చేశారు.
దాదాపు పది లక్షలు వరకు సొత్తు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తొక్కిసలాట ఘటన తర్వాత పోలీసుల ఆదేశాల మేరకు ఈ ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
