Allu Arjun : మలయాళం దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. అయితే ఆ వార్తలు నిజమేనా?
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా వేరే పరిశ్రమ డైరెక్టర్స్ పేర్లే వినిపిస్తున్నాయి.(Allu Arjun)
Allu Arjun
- మలయాళం డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా
- రూమర్స్ నిజమవుతాయా
- ఈ ఒక్క ఫొటో వైరల్
Allu Arjun: అల్లు అర్జున్ ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఎక్కువగా వేరే భాషా దర్శకులతో చేయడానికే మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా వేరే పరిశ్రమ డైరెక్టర్స్ పేర్లే వినిపిస్తున్నాయి.
అందులో మలయాళం దర్శకుడు బసిల్ జోసెఫ్ పేరు కూడా వినిపించింది. బసిల్ జోసెఫ్ నటుడిగా, హీరోగా మలయాళంలో స్టార్ గా దూసుకుపోతున్నాడు.ఇక్కడ తెలుగులో కూడా ఆయన సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నటుడిగానే కాక బసిల్ జోసెఫ్ దర్శకుడిగా కూడా సక్సెస్ లు కొట్టాడు. మిన్నల్ మురళి లాంటి భారీ హిట్ సినిమా బసిల్ జోసెఫ్ తెరకెక్కించాడు.
బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని గతంలో రూమర్స్ వచ్చాయి. తాజాగా జరిగిన అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కి బసిల్ జోసెఫ్ హాజరయ్యాడు. అట్లీ కూడా హాజరయ్యాడు. బన్నీతో పనిచేసిన దర్శకులు పలువురు హాజరయ్యారు. బసిల్ జోసెఫ్ ని దగ్గరుండి తీసుకొచ్చే స్టేజ్ మీద ఫోటో దిగాడు అల్లుఅర్జున్.
అసలు ఇప్పటివరకు అల్లు అర్జున్ -బసిల్ జోసఫ్ కలిసి కనిపించలేదు. బసిల్ బన్నీ కి కథ చెప్పాడు అన్న రూమర్స్ తప్ప ఇద్దరికీ అంత పరిచయం కూడా లేదు. ఇప్పుడు ఏకంగా అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో బన్నీ – బసిల్ క్లోజ్ గా కనపడటంతో నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని భావిస్తున్నారు. అసలే మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది మలయాళం దర్శకుడితో సినిమా చేస్తే అక్కడ కూడా పెద్ద హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

