Jabardasth Sunny : కోట్ల ఆస్తి.. 8 ఏళ్ళు లవ్ చేసి అమ్మాయి వదిలేయడంతో.. పాపం జబర్దస్త్ సన్నీ బ్రేకప్ స్టోరీ తెలిస్తే ఏడవడం ఖాయం..
ఇటీవల ఓ జబర్దస్త్ ఎపిసోడ్ లో సన్నీ తన లవ్ ఫెయిల్యూర్ గురించి తెలిపాడు.(Jabardasth Sunny)
Jabardasth Sunny
- జబర్దస్త్ సన్నీ లవ్ ఫెయిల్యూర్
- 8 ఏళ్ళు లవ్ చేసి అమ్మాయి వదిలేయడంతో
- ఈ బ్రేకప్ స్టోరీ మీకు తెలుసా
Jabardasth Sunny : జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. జబర్దస్త్ సన్నీ అసలు పేరు సునీల్ చంద్ర. సన్నీకి కూడా ఏజ్ ఎక్కువే ఉన్నా ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. అయితే అసలు పెళ్లి వద్దనుకున్నాడట సన్నీ.
ఇటీవల ఓ జబర్దస్త్ ఎపిసోడ్ లో సన్నీ తన లవ్ ఫెయిల్యూర్ గురించి తెలిపాడు.
Also Read : Anji Movie : అంజి సినిమాకు డైరెక్టర్ మారాడని తెలుసా? అసలు ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే..?
సన్నీ మాట్లాడుతూ.. ఒక అమ్మాయిని లవ్ చేశాను. 8 ఏళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉందని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందుకే అప్పట్నుంచి పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు.
సన్నీ గురించి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సన్నీ కోటీశ్వరుడు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ వల్ల లైఫ్ ని అలా వదిలేసాడు. వాళ్ళ అన్నయ్య, వదిన పెద్ద డాక్టర్స్. పెళ్లి చేసుకో మంచిగా ఉండు అని చెప్పినా వినలేదు. లైఫ్ లో అన్ని వదిలేసాడు. పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంటికి కూడా రెగ్యులర్ గా వెళ్ళడు. మా రూమ్ లోనే, లేదా ఎవరో రూమ్ లోనో తాగుతూ ఉండిపోతాడు అని తెలిపాడు.
కోట్ల ఆస్తి ఉంచుకొని కూడా ఇలా ఒక అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండటంతో సన్నీ లవ్ స్టోరీ విని పాపం అంటున్నారు నెటిజన్లు.
