Anji Movie : అంజి సినిమాకు డైరెక్టర్ మారాడని తెలుసా? అసలు ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే..?
అదే క్లైమాక్స్, అదే గ్రాఫిక్స్ తో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యేది.
Anji Movie
- మెగాస్టార్ అంజి సినిమా
- మొదట వేరే డైరెక్టర్
- ఎందుకు మార్చారు అంటే
Anji Movie : మెగాస్టార్ కెరీర్లో ఎక్కువ కాలం సాగిన సినిమా అంజినే. రకరకాల కారణాలతో దాదాపు 5 ఏళ్ళు ఈ సినిమాని సాగదీశారు. సినిమా బాగున్నా అప్పుడు కమర్షియల్ గా ఆడలేదు. అదే క్లైమాక్స్, అదే గ్రాఫిక్స్ తో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యేది.
అంజి సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసారని అందరికి తెలిసిందే. అయితే అంజి సినిమాకు మొదట కోడి రామకృష్ణ డైరెక్టర్ కాదు. అంజి సినిమా షూటింగ్ తమిళ దర్శకుడు సభాపతితో మొదలుపెట్టారు.
సభాపతి తమిళ్ లో ఓ పది సినిమాలు తీశారు దర్శకుడిగా. తెలుగులో జగపతి బాబుతో పందెం సినిమా తీశారు. ఆయనతో అంజి సినిమా మొదలుపెట్టారు కానీ కొంత భాగం షూటింగ్ అయ్యాక సభాపతి తీసిన విజువల్స్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. దీంతో తనతో రెగ్యులర్ గా సినిమాలు చేసిన డైరెక్టర్ కోడి రామకృష్ణ కు అంజి సినిమా బాధ్యతని అప్పగించారు.
స్క్రిప్ట్ ఏం మార్చలేదు కానీ ఆల్రెడీ షూటింగ్ అయిన దాంట్లో కేవలం పనికొచ్చేది మాత్రమే తీసుకున్నారు. ఒకానొక దశలో సభాపతి తీసిన ఫుటేజీని పక్కనపారేసి మళ్ళీ రీ షూట్ చేద్దామనుకున్నారు కానీ కోట్లు వృథా అవుతాయని, అప్పటికే బడ్జెట్ పెరిగిపోతుందని పనికొచ్చేవి తీసుకున్నారు. డైరెక్టర్ సభాపతి 2024 లో మరణించారు.
Also Read : Vijay Deverakonda : సొంతూరి కోసం కొండన్న మంచి మనుసు.. ఇకపై స్కాలర్ షిప్స్..
అలాగే అంజి సినిమాకు మొదట టబుని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత నమ్రతా శిరోద్కర్ ని తీసుకున్నారు.
