Sandeep Saroj : రామ్ చరణ్ కి పిచ్చ ఫ్యాన్.. పదేళ్ళప్పుడే మగధీర సినిమా చూసి.. సందీప్ సరోజ్ కామెంట్స్..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సందీప్ సరోజ్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. (Sandeep Saroj)
Sandeep Saroj
Sandeep Saroj : మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు తోనే భారీ విజయం సాధించాడు సందీప్ సరోజ్. ఆ సినిమా పెద్ద హిట్ అయి నేషనల్ అవార్డులు కూడా సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో బాలు గీత అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సందీప్ సరోజ్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
Also Read : ENE Repeat : వామ్మో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొనుక్కుందో తెలుసా?
సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. మగధీర సినిమా చూస్తున్నపుడు ఫస్ట్ టైం వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. నాకు అప్పుడు పదేళ్లు. అప్పట్నుంచి నేను రామ్ చరణ్ కి పిచ్చ ఫ్యాన్. ఒక డైలాగ్ ఉంటుంది. నువ్వు పదేళ్లుగా ఆయనకు ఫ్యాన్ ఏమో. వాడు వయసు పదేళ్ళప్పటి నుంచే ఆయనకు ఫ్యాన్ అని. అలా నేను అప్పట్నుంచే రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్. మగధీర సినిమా చూసి నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయి నేర్చుకున్నాను. ఎప్పటికైనా మగధీర లాంటి సినిమా రాకపోతుందా చూడాలి అని అన్నారు.
