Chandrababu Naidu : సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు, లోకేశ్ .. వీడియో వైరల్

Chandrababu Naidu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రా

Chandrababu Naidu : సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు, లోకేశ్ .. వీడియో వైరల్

CM Chandrababu Nara Lokesh

Updated On : January 12, 2026 / 11:40 PM IST

Chandrababu Naidu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ వీడియోను టీడీపీ సోషల్ మీడియా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.