AP Govt : సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5.70లక్షల మందికి శుభవార్త
AP Govt : సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి మేలు జరగనుంది.
AP Government
- ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక
- పెండింగ్ బిల్లులు క్లియర్
- మొత్తం 5.7 లక్షల మందికి చేకూరనున్న లబ్ధి
AP Govt : సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పింది. మొత్తంగా 5.70 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
Also Read : మరో కీలక ఘట్టం.. ఆ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
ఏపీలో నీరు-చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ ఆర్థిక శాఖ బిల్లులను క్లియర్ చేసింది. అదేవిధంగా మొత్తంగా రూ.2653 కోట్ల మేర ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న ఒక డీఏ, డీఆర్ ఎరియర్స్ నిమిత్తం సర్కార్ రూ.110 కోట్లు విడుదల చేసింది. డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులతో 2.25లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లలో రూ.110 కోట్లు మంజూరు చేసింది. దీంతో సుమారు 55వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్ ల చెల్లింపులు జరగనున్నాయి.
ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనుల నిమిత్తం రూ. 1243 కోట్ల విడుదల చేసిన ఏపీ సర్కార్.. ఇందులోనే నీరు – చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు రూ.40కోట్లు విడుదల చేసింది.
నీరు-చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు 19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి ఊరట కల్పిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం బిల్లులు, బకాయిలు చెల్లింపునకు నిధులు విడుదల చేసింది.
