మరో కీలక ఘట్టం.. ఆ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్‌కు రైతులు ఘన స్వాగతం పలికారు.
Amaravati (Image Credit To Original Source)
- అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్
- మొత్తం ఏడు గ్రామాల్లో ప్రక్రియ
- ఇప్పటివరకు 4 గ్రామాల్లో ప్రారంభం
Amaravati Capital Region: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెదకూరపాడు మండలం కర్లపూడి-లేమల్లెలో మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి రైతుల నుంచి మంత్రి నారాయణ అంగీకార పత్రాలను స్వీకరించారు. గ్రామంలో 2,654 ఎకరాలకు కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్.. ఉన్నట్టుండి అంతరాయం
కాగా, అంతకుముందు ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్‌కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్‌కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ఏడు గ్రామాలకుగాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
రాజధాని ప్రాంతంలో 16,666 ఎకరాల భూసమీకరణ చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలో వైకుంఠపురంతో పాటు పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఉన్నాయి.
మిగతా గ్రామాలు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్మించాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తోంది.
