Reliance Jio Plans : జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో 2 కొత్త ప్లాన్లు.. మరెన్నో డేటా బెనిఫిట్స్, ధర ఎంతో తెలుసా?

Reliance Jio Plans : రిలయన్స్ జియో ఇటీవలే రెండు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. జియోసావన్ ప్రో (JioSaavn Pro)కి కూడా సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి.

Jio launches 2 new plans with 84 days validity check price, benefits and more

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఇటీవలే రెండు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీని అందిస్తుంది. (JioSaavn Pro)కి కూడా జియో సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియో ఇటీవల జియోసావ్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ వంటి మరెన్నో బెనిఫిట్స్ కోరుకునే యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు రూ. 269 నుంచి ప్రారంభమై రూ. 789 వరకు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ నుంచి త్రైమాసిక బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. ఈ లిస్టులో రెండు ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కాలింగ్, అదనపు వ్యాలిడిటీ కోసం చూసే యూజర్ల కోసం ప్రత్యేకంగా జియో అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ. 739, రూ. 789 ధరతో ఈ ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. 5G డేటా బెనిఫిట్స్ వంటి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లను ఎంచుకున్న జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా (JioSaavn Pro) సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ (JioSaavn Pro) యాడ్-ఫ్రీ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, (JioTunes) ఫీచర్లను అందిస్తుంది. ఈ సర్వీసు ద్వారా యూజర్ల కోసం కొత్తగా అందించే రూ.739, రూ.789 ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

జియో రూ. 739 ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. 1.5GB రోజువారీ డేటా క్యాప్‌తో మొత్తం 126GB డేటా అలవెన్స్‌ను కలిగి ఉంటుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్నాక స్పీడ్ 64 Kbps వద్ద అన్‌లిమిటెడ్ డేటాకు తగ్గిస్తుంది. అదనంగా, యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. రోజుకు 100 SMSలను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా వివిధ Jio యాప్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తుంది.

Reliance Jio Plans : Jio launches 2 new plans with 84 days validity check price, benefits

జియో రూ. 789 ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో సహా మునుపటి ప్లాన్‌లకు సమానమైన బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్యాక్‌తో యూజర్లు మొత్తం 168 GB హై-స్పీడ్ డేటాను అందుకోవచ్చు. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను ఉపయోగించవచ్చు. అదనంగా, యూజర్లు JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity, JioCloud వంటి Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్ ద్వారా అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ముఖ్యంగా, Jio 5G నెట్‌వర్క్ ప్రాంతంలో ఉంటున్న జియో యూజర్లు కూడా హై-స్పీడ్ 5వ జనరేషన్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ పొందవచ్చు.

జియో 5G యాక్సస్ చేయాలంటే?

* మీ ఫోన్ Settings ఓపెన్ చేయండి.
* మొబైల్ నెట్‌వర్క్‌పై Tap చేయండి.
* Jio SIM ఎంచుకుని, మీకు నచ్చిన నెట్‌వర్క్ (Type Option)పై Click చేయండి.
* ఇప్పుడు 5G, ఇండిపెండింట్ నెట్‌వర్క్‌ని ఎంచుకోండి.

ఇంతలో జియో కూడా (JioSaavn Pro) సబ్‌స్క్రిప్షన్‌తో మరిన్ని ప్లాన్‌లను లాంచ్ చేసింది. రూ. 269, రూ. 529, రూ. 589 ధర కలిగిన ఈ ప్లాన్‌లలో 5G యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉంటాయి.

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
జియో రూ 269 ప్లాన్ : ఈ ప్లాన్ 1.5 రోజువారీ డేటా క్యాప్‌తో 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీని అందిస్తుంది.
జియో రూ. 529 ప్లాన్ : ఈ ప్లాన్ కింద జియో యూజర్లు 1.5GB రోజువారీ హైస్పీడ్ డేటాతో 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.
జియో రూ 589 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌తో, యూజర్లు 56 రోజుల పాటు 2GB రోజువారీ డేటా క్యాప్‌ను పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు