Sajjanar : ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి... ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు.

TSRTC MD Sajjanar : ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల్లోకి తీసుకురావడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. ప్రైవేటు వాహనాలు కాకుండా… ప్రతి ఒక్కరు బస్సు ఎక్కాలని రిక్వెస్ట్ చేశారు. సురక్షితంగా ఇళ్లకు, గమ్య స్థానాలకు చేర్చేది బస్సులే అన్నారు సజ్జనార్.

CP Sajjanar : సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రా

ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చారు సజ్జనార్. ఆర్టీసీ లాస్ లో ఉందన్నది అందరికీ తెలిసిందే అన్నారు. గడిచిన 3,4 ఏళ్లుగా కరోనా కారణంగా… ఆర్టీసీపై దెబ్బ మీద దెబ్బ పడిందన్నారు. డీజిల్ రేటు భారీగా పెరిగిందని చెప్పిన సజ్జనార్.. నష్టాలనుంచి సంస్థను బయటపడేయటంపై ఫోకస్ పెడతామన్నారు.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు.!

డీజిల్ రేట్ మాత్రమే కాదు…. బస్సుల విడిభాగాల రేట్లు గా భారీగా పెరిగాయన్నారు సజ్జనార్. కరోనాతో పోల్చితే.. ప్రస్తుతానికి పరిస్థితి కుదుటపడిందని.. ఇంకా మంచిరోజులు రానున్నాయని అన్నారు. తనతో పాటు… కమిట్ మెంట్ తో పనిచేసే ఆఫీసర్లు ఆర్టీసీలో చాలామంది ఉన్నారన్నారు. ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి… ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు. సంస్థ ఆరోగ్యం.. ఉద్యోగుల సంక్షేమం ముఖ్యమని చెప్పిన సజ్జనార్… ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నచోట ట్రిమ్ చేసే ఆలోచన ఉందన్నారు. కచ్చితంగా రిజల్ట్ చూపిస్తామన్నారు సజ్జనార్.

ట్రెండింగ్ వార్తలు