Samsung Galaxy M22 : శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే.. ఇండియా సపోర్టు పేజీలో లైవ్!

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ భారత మార్కెట్లోకి వస్తోంది. లాంచింగ్ ముందే శాంసంగ్ అధికారిక ఇండియా సపోర్టు పేజీలో ఈ కొత్త సిరీస్ కనిపించింది.

Samsung Galaxy M22 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో భారత మార్కెట్లోకి వస్తోంది. లాంచింగ్ ముందే శాంసంగ్ అధికారిక ఇండియా సపోర్టు (Samsung India website) పేజీలో ఈ కొత్త సిరీస్ మోడల్ దర్శనమిచ్చింది. అదే.. Samsung Galaxy M22.. ఈ మోడల్ ఫోన్ ఎప్పుడూ మనదేశంలో లాంచ్ అవుతుందో ఎలాంటి వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. అయితే మోడల్ నెంబర్ (SM-M225FV/DS) మాత్రం డిస్‌ప్లే చేసింది. గత నెలలోనే శాంసంగ్ Galaxy M22 సిరీస్ మోడల్‌ను జర్మనీలో లాంచ్ అయింది.

6.4 అంగుళాల HD+ Super AMOLED డిస్ ప్లేతో లాంచ్ అయింది. 4GB RAMతో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్ తో వచ్చింది. 13MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లోని సపోర్టు పేజీలో ఈ Samsung Galaxy M22 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లైవ్ చేసింది. మోడల్ నెంబర్ (SM-M225FV/DS).. సెప్టెంబర్ నెలలో రష్యాలో ఇదే మోడల్ సపోర్టు పేజీలో లైవ్ అయింది. dual-SIM సామర్థ్యంతో స్మార్ట్ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
Samsung Galaxy F42: శాంసంగ్ నుంచి ట్రిపుల్ కెమెరాతో అద్భుతమైన ప్రొడక్ట్

ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ M22 సిరీస్ ఫోన్ ధర భారత మార్కెట్లో ఎంత ఉండనుందో కంపెనీ రివీల్ చేయలేదు. జర్మనీలో లాంచ్ అయిన ఈ ఫోన్ EUR 239.90 (రూ.20,700) వరకు ఉంటుందని అంచనా. జర్మనీలో ఆన్ లైన్ మార్కెట్లోనే కాదు.. ఆఫ్ లైన్ మార్కెట్లోనూ ఈ సిరీస్ మోడల్ అందుబాటులోకి వచ్చేసింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

స్పెషిఫికేషన్లు ఇవే (అంచనా) : 
జర్మన్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ M22 ఆండ్రాయిడ్ వెర్షన్ సపోర్టు చేస్తుంది. 6.4 అంగుళాల HD+ (720×1,600ఫిక్సల్స్) Super AMOLED డిస్‌ప్లే, 16 మిలియన్ల కలర్లతో ఆకర్షణీయంగా ఉండనుంది. 4G RAM కాంబినేషన్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజీ 128GB ఉండగా.. మైక్రోSD కార్డు (1TB) వరకు మెమరీ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.

కెమెరాల విషయానికి వస్తే.. Galaxy M22 ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ సెన్సార్, రెండు 2MP సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13MP ప్రైమరీ సెన్సార్ ఉంది. భారీ బ్యాటరీ 5,000mAhతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. కనెక్టవిటీ ఆప్షన్లలలో డ్యుయల్ సిమ్ స్లాట్స్, NFC, బ్లూటూత్ v5, Wi-Fi 802.11c USB Type-C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, 159.9x74x8.4mm, 186గ్రాముల బరువు ఉంటుంది.
Samantha : అంతరిక్షంలోకి సమంత..అరుదైన ఘనత..!

ట్రెండింగ్ వార్తలు