Sacred Waist Thread For Men : మగవాళ్లకు మొలతాడుకు సంబంధమేంటీ..? భారతీయ సంప్రదాయం వెనుక సైన్స్

మగవాళ్లకు మొలతాడుకు సంబంధమేంటీ..? ఆ బంధం వెనుక కారణమేంటి..భారత్ లో మగవాళ్లు కట్టుకునే మొలతాడు వెనుక ఉన్నది కేవలం సంప్రదాయం మాత్రమేనా మరేవైనా కారణాలున్నాయా..?

molathadu for mens

Molathadu for mens : మగవాడు మొలతాడు. మెలతాడులేని మగవాడు ఉండడు. మొలతాడు కట్టిన మగాడు. మొలతాడు కట్టుకోలేదు నువ్వు మగాడివి కాదేంటిరా..?మొలతాడు కట్టినోడే మగాడు..మొనగాడు.మొలతాడు కట్టుకోకపోతే మగాడు కాదా..? ఇలా మగవాడి జీవితంలో మొలతాడు ఓ భాగంగా మారిపోయింది. భాగమే కాదు శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. మొగవాళ్లకు మొలతాడుకు ఉన్న సంబంధమేంటి..ఆ బంధమేంటీ..? అంటే చాలానే ఉందటం..మొలతాడు కేవలం ఓతాడు మాత్రమే కాదని ప్రత్యేకించి మగవాళ్లు మొలతాడు కట్టుకోవటం వెనుక శాస్త్రీయత కూడా ఉందంటున్నారు నిపుణులు.

సాధారణంగా భారతీయ సంప్రదాయాలన్నీ సైన్స్ లోంచి వచ్చినవే. సైన్స్ ఎంతో డెవలప్ మెంట్ అయిన ఈ కాలంలో సంప్రదాయం మూఢత్వంగా కొట్టిపారేస్తున్నారుగానీ..ఆ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంటే భారతీయుల ముందుచూపు…భారతీయ సంప్రదాయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటిదే మగవాళ్లు కట్టుకునే ‘మొలతాడు’ను కట్టుకోవాలనే విషయం వెనుక ఉన్న కారణం కూడా..

woman Birth Child On Beach : బీచ్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ

మగవాళ్లు మొలతాడు లేకుండా ఉండకూడదని పెద్దలు అంటారు. ఎందుకు..? అంటే ఏమో పెద్దవాళ్లు చెప్పారు అని అంటారు గానీ దానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. పెద్దవాళ్లు చెప్పారు అంతే అనే మాటే చెబుతారు. కానీ మగవాళ్లు మొలతాడు కట్టుకోవటం వెనుక ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

సాధారణంగా పుట్టిన తరువాత ఆడపిల్లకు మగపిల్లాడు అనే తేడా లేకుండా బిడ్డలకు మొలతాడు కడతారు. కానీ ఆడపిల్లకు కొంతవయస్సు అంటే ఐదేళ్లలోపే మొలతాడు కట్టటం మానేస్తారు. కానీ మగపిల్లాడికి మాత్రం పెద్ద అయినా పెళ్లి అయినా మొలతాడు కట్టుకోవాల్సినని పెద్దలు చెబుతారు. అది ఎందుకు అనే విషయం తెలుసుకుందాం..

చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయి‌.ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ు. మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంది. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంది. ఈ విషయాన్ని పరిశోధనల్లో కూడా నిరూపించబడింది.

Diamonds : వజ్రాలకు భూమికి సంబంధమేంటి..? ఒక వజ్రం తయారవ్వడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో తెలుసా..?

వృషణాలు అధిక వేడికి గురయితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు. ఏదైమైనా హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని ఉందని పెద్దలు చెబుతారు. కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. కాగా..మొలతాడులో చాలా రకాలు ఉన్నాయి. వారి వారి స్థాయిలను బట్టి పిల్లలకు బంగారం, వెండి మొలతాడులు కడుతారు పెద్దలు.

మొలతాడు గురించి నమ్మకాలు..సంప్రదాయం వెనుక జాగ్రత్తలు
మొలతాడుకు పిన్నీసులు వంటి పెట్టకూడదు..
మొలతాడు కట్టుకుంటే దృష్టిదోషం తలకుండా ఉంటుంది..
మొలతాడు కట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..
మగవాళ్లు స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండకూడదట..అందుకే పూర్వం గోచీలు పెట్టుకుని స్నానం చేసేవారు..
వేదాలల్లో కూడా మగవాళ్లు నగ్నంగా స్నానం చేయకూడదని ఉందట..(నగ్నంగా స్నానం చేేసే యక్షులు శాపాలకు గురి అయ్యారనే కథనాలు)..
వృషణాలు చాలా సున్నితమైనవిగా ఉంటాయి. ఏదైనా గాయం కాకుండా ఉండటానికి వస్త్రం ధరించే స్నానం చేయాలి..
నదులు, కాలువలు, సముద్రాల్లో స్నానం చేసే సమయంలో కచ్చితంగా ఏదోక ఇన్నర్ వేర్ (గోచీ)ధరించాలి..లేదంటే జలచరాల వల్ల సమస్యలు రాకుండా గోచీలాంటిది ధరించాలి..

ట్రెండింగ్ వార్తలు