Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

ప్రస్తుతం రుచిర భూటాన్‌లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

Ruchira Kamboj: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్. ఈ మేరకు భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రుచిర భూటాన్‌లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?

ఆయన స్థానంలో త్వరలోనే రుచిరా కాంబోజ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 1987లో ఆమె సివిల్స్‌లో ఆల్ ఇండియా ఉమన్ టాపర్‌గా నిలిచారు. రుచిర అనేక దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. గతంలో కూడా ఆమె ఐరాసలో భారత్ తరఫున సేవలందించారు. పలు విభాగాల్లో కీలకంగా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు