Telangana Assembly Session 2023: ఆర్టీసీ విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం.. సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు.

TSRTC bill

Telangana Assembly Session 2023 – TSRTC: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (Puvvada Ajay Kumar) ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జగిరింది. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని పువ్వాడ స్పష్టతనిచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు, ఇవాళ కేసీఆర్ మాట్లాడుతూ.. దేశమే ఆశ్చర్యపోయేలా తెలంగాణలోని ఉద్యోగులకు పే స్కేల్‌ ఇస్తామని ప్రకటించారు. అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలుగా ఉందని, ఏపీ తలసరి ఆదాయం రూ.2.19 లక్షలు మాత్రమేనని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ముంచిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, ఆ తర్వాత సాధించిన ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఒక రోజు పోరాటంతోనో, ఒక నాయకుడి వల్లో వచ్చింది కాదని అన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని స్పష్టతనిచ్చారు. కాగా, తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదించింది.

మరో 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి కూడా సమావేశాలు జరగనున్నాయి.

Gaddar Death : ప్రజా ఉద్యమాలు, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది- గద్దర్ మృతికి చంద్రబాబు సంతాపం

ట్రెండింగ్ వార్తలు