UP Police Crying For Food: భోజనం బాగోలేదని రోడ్డుపైకొచ్చి ఏడ్చిన పోలీస్.. వైరల్‌గా మారిన వీడియో ..

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్.. చేతిలో భోజనం ప్లేటుతో నడిరోడ్డుపై నిలబడి ఏడ్చాడు. అక్కడ ఉన్నవారు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగడంతో మరింత బిగ్గరగా ఏడుస్తూ తన బాధను తెలపడం మొదలు పెట్టాడు.

UP Police Crying For Food: ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్.. చేతిలో భోజనం ప్లేటుతో నడిరోడ్డుపై నిలబడి ఏడ్చాడు. అక్కడ ఉన్నవారు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగడంతో మరింత బిగ్గరగా ఏడుస్తూ తన బాధను తెలపడం మొదలు పెట్టాడు. ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోజ్ కుమార్ అనే పోలీసు కానిస్టేబుల్ పోలీసుల మెస్‌లో వడ్డించే భోజనం నాణ్యతగా లేదని, తినలేక పోతున్నామని ఏడుస్తూ వాపోయాడు.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

మనోజ్ రోడ్డుపై ప్రదర్శించిన ప్లేట్‌లో రోటీలు, పప్పు, అన్నం కనిపిస్తున్నాయి. అయితే ఏడుస్తూ నిరసన తెలుపుతున్న మనోజ్ ను ఓ సీనియర్ అధికారి తిరిగి స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే నాణ్యతలేని ఆహారంపై తన సీనియర్ల కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మనోజ్ వాపోయాడు. నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, పోలీస్ అధికారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భత్యం ఇస్తుందని సీఎం గతంలోనే ప్రకటించారని మనోజ్ అన్నారు.

చాలా గంటలు డ్యూటీ చేసిన తర్వాత మాకు లభించేది ఇదే అని వాపోయాడు. సరియైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పనిచేస్తారంటూ ప్రశ్నించారు. మరొక వీడియోలో అతను ఆహారం ప్లేట్ తో డివైడర్ పై కూర్చొని జంతువులు కూడా దీనిని తినవు అని చెప్పాడు. అయితే కానిస్టేబుల్ తీరుపై ఫిరోజాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. కానిస్టేబుల్ మనోజ్ కుమార్ పై అనేసార్లు క్రమశిక్షణ ఉల్లంంఘటన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయని తెలిపారు. అక్రమాలు, ఇతర సమస్యలపై గతంలో పదిహేను సార్లు శిక్షించబడ్డాడని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు