Tipta Motha: టార్గెట్ బీజేపీ.. పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే మోత మోగించిన తిప్రా మోత

పోటీకి దిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా ఓట్లను సాధించడమే కాకుండా అంతే స్థాయిలో సీట్లను కూడా సాధించింది. 20.1 శాతం ఓట్లతో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో 11 సీట్లు బీజేపీ నుంచే లాక్కుంది. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకోగా ఈసారి కేవలం 33 స్థానాలకే పరిమితం అయింది.

Tipta Motha: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి మరోమారు అధికారాన్ని సాధించింది. 60 స్థానాలు ఉన్న త్రిపురలో ఆ పార్టీ ఏకంగా 32 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఐదేళ్ల క్రితం అధికారం కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) ఈ ఎన్నికల్లో మరింత దిగజారింది. గతంలో సీట్లు మాత్రమే పోగొట్టుకున్న ఆ పార్టీ, ఈసారి ఓట్లు కూడా బాగానే కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో 22 శాతం ఓట్లు సాధించింది.

Assembly Elections Results: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంతిమ ఫలితాలు ఇవే..

అయితే ఈ ఎన్నికల్లో అసలు ఛాంపియన్ అంటే తిప్రా మోతా పార్టీ అని చెప్పొచ్చు. పోటీకి దిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా ఓట్లను సాధించడమే కాకుండా అంతే స్థాయిలో సీట్లను కూడా సాధించింది. 20.1 శాతం ఓట్లతో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో 11 సీట్లు బీజేపీ నుంచే లాక్కుంది. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకోగా ఈసారి కేవలం 33 స్థానాలకే పరిమితం అయింది. ఇక సీపీఎం గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకోగా ఈసారి 5 సీట్లు కోల్పోయింది. బీజేపీకి ఓట్ బ్యాంక్ తగ్గలేదు. కానీ సీట్లు తగ్గాయి. సీపీఎంకు సీట్లలో అంత పెద్ద వ్యత్యాసం లేదు కానీ, ఓట్లు సగానికి సగం తగ్గాయి.

Assembly Elections Results: గత ఎన్నికలో సీట్లు.. ఈ ఎన్నికలో ఓట్లు కూడా కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ

ఆ విధంగా బీజేపీ నుంచి సీట్లు, సీపీఎం నుంచి ఓట్లు సాధించింది త్రిపా మోత పార్టీ. రాష్ట్రంలోని తిప్రా ఆధిపత్య ప్రాంతాలను నిర్వహించే త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్(టీటీఏడీసీ)కి 2021లో జరిగిన ఎన్నికలలో తిప్రా మోత మంచి ఫలితాలు సాధించింది. టీటీఏడీసీలోని 30 స్థానాలకు గానూ ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 60 మంది సభ్యుల శాసనసభలో 20 గిరిజనుల ఆధిపత్య స్థానాల్లో తిప్రా మోత తన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఆ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేసింది. ఇక దీనితో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల కారణంగా స్థానిక గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. ఈ మద్దతు కూడా ఆ పార్టీకి బాగా కలిసి వస్తుందని అప్పట్లో విశ్లేషనలు వచ్చాయి.

Assembly Election Results 2023: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్‭పీపీకి బీజేపీ మద్దతు: అసోం సీఎం

అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో తిప్రా మోత తన ప్రభావాన్ని చూపించింది. వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తిప్రా మోత అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బ‌ర్మ తన తిప్రా మోత పార్టీ కోసం ఒంటరిగా ప్రచారం చేశారు. కాగా, తాజా ఫలితాలపై ప్రద్యోత్ కిషోర్ స్పందిస్తూ ‘‘రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా మేము అవతరించాము. కేవలం రెండేళ్లలోనే ఈ విజయాన్ని కైవసం చేసుకున్నాము. వాస్తవానికి మేము ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తామని అనుకున్నాం. కానీ మా అంచనాల కంటే తక్కువ సీట్లు వచ్చాయి. మాకు మద్దతు ఇచ్చిన త్రిపుర ఓటర్లకు ధన్యవాదాలు’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు