Assembly Election Results 2023: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్‭పీపీకి బీజేపీ మద్దతు: అసోం సీఎం

"మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకోసం నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతు తెలపాలని ఆ రాష్ట్ర బీజేపీకి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం కాన్రాడ్ సంగ్మా ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు అడిగారు" అని హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

Assembly Election Results 2023: మేఘాలయలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏయే పార్టీల కూటమి ఏర్పాటు చేస్తుందన్న ఆసక్తి నెలకొంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‭పీపీ) 25 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో మొత్తం సీట్లు 60. ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు కావాలి. బీజేపీకి 3 సీట్లు మాత్రమే దక్కాయి.

ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీలతో ఎన్‭పీపీ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసం మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్పీపీ అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు.

“మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకోసం నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతు తెలపాలని ఆ రాష్ట్ర బీజేపీకి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం కాన్రాడ్ సంగ్మా ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు అడిగారు” అని హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

కాగా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే ఎన్డీఏలో ఎన్‭పీపీ కొనసాగుతోంది. మేఘాలయలో బీజేపీతో ఆ పార్టీ కలిసినప్పటికీ 28 సీట్లే అవుతాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మరో మూడు సీట్లు అవసరం ఉంటుంది. మరోవైపు, ఇప్పటికే మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ కు కూడా ఎన్‭పీపీ నేతృత్వం వహిస్తోంది.

Assembly Elections Results: గత ఎన్నికలో సీట్లు.. ఈ ఎన్నికలో ఓట్లు కూడా కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ

ట్రెండింగ్ వార్తలు