బాబోయ్.. వీడు మనిషేనా? ఈ వీడియోను చూస్తే మీకూ కోపమొస్తుంది..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరౌత్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..

Dog Brutally Assaulted in Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లోని ఓ వ్యక్తి కుక్క పట్ల క్రూరంగా వ్యవహరించాడు. బట్టలను బండకేసి బాదినట్లుగా కుక్క కాళ్లను పట్టుకొని దానిని రోడ్డుకేసి కొట్టాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్క పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టెంపో ట్రావెలర్.. 14 మంది దుర్మరణం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరౌత్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి వీధి కుక్కను రోడ్డుకేసి బాదుతూ కనిపించాడు. కుక్క వెనుకభాగంలోని రెండు కాళ్లను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ రోడ్డుకేసి కొట్టాడు. ఇలా చాలాసార్లు చేశాడు. అతడు కుక్కపట్ల క్రూరంగా ప్రవర్తిస్తుండటంతో అతని చుట్టుపక్కనే నాలుగైదు కుక్కలు మొరుగుతూ అతన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ భయంతో ఆ పని చేయలేక పోయాయి. ‘కుక్కను వదిలేయండి.. అది చచ్చిపోతుంది’ అంటూ చుట్టుపక్కల వారు వారించినప్పటికీ అతడు వినలేదు.

Also Read : Petrol Prices Hike : వాహనదారులకు భారీ షాక్.. రూ. 3 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క పట్ల క్రూరంగా వ్యవహరిస్తుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించలేదంటూ కొందరు మండిపడుతున్నారు. కుక్కపట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తుండగా.. ఎవరైనా మూగ జంతువుతో ఇలా ఎలా ప్రవర్తిస్తారా అంటూ మరికొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు