రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని..! ప్రపంచమే అబ్బురపోయేలా మహానగర నిర్మాణానికి ప్రణాళిక

భ్రమరావతి అన్న పరిహాసాలు ప్రతిధన్వించిన చోట.. కళ్లు చెదిరే కట్టడాలు కొలువుదీరనున్నాయి. ఆగిపోయిన దగ్గరే మొదలు పెట్టాల్సి రావడం బాధాకరమైనప్పటికీ..

Ap Capital Amaravati : మహిమాన్వితంగా వెలగబోయే మహానగర నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. గత కాలపు చేదు గుర్తులను మర్చిపోయి ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడువు పెట్టుకుని మరీ కలల సౌధాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేసుకునేందుకు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. చారిత్రక వైభవాన్ని మన తరంలో మళ్లీ చూడగలిగే రోజులు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. కొన్ని వందల ఏళ్ల పాటు నిలిచిపోయే చరితకు మనం సాక్షులుగా మారబోతున్న అద్భుత అవకాశం దగ్గరలో వస్తోంది.

రాజధాని లేని రాష్ట్రంగా అభాసుపాలైన స్థితి నుంచి ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన రాజధానిని నిర్మించుకున్న రాష్ట్రంగా నిలిచేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన మిగిల్చిన అపార నష్టాన్ని 5కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం, మొక్కవోని పట్టుదల, ధృడ సంకల్పంతో అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భ్రమరావతి అన్న పరిహాసాలు ప్రతిధన్వించిన చోట.. కళ్లు చెదిరే కట్టడాలు కొలువుదీరనున్నాయి. ఆగిపోయిన దగ్గరే మొదలు పెట్టాల్సి రావడం బాధాకరమైనప్పటికీ.. అసలు తిరిగి ప్రారంభించే అవకాశం లభించడమే మహాద్భుత ఘట్టం, ప్రాముఖ్యత మరువరానిది.

విభజనలో సర్వం నష్టపోయి రాజధాని లేని నగరంగా మిగిలిన రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కూడా మారని పరిస్థితులు ప్రజల్లో భవిష్యత్తుపైన ఆందోళన పెంచాయి. ఆ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో ఉషోదయ కాంతులు మొదలయ్యాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కొత్త ప్రభుత్వం అమరావతికి మళ్లీ ఊపిరిపోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతి ప్రస్తుత స్థితిగతులపైన ఓ అంచనాకు వచ్చిన వెంటనే మహానగర నిర్మాణం కలను సాకారం చేసే ప్రయత్నాలు మొదలు కానున్నాయి.

Also Read : లోకేశ్ రెడ్ బుక్.. తీవ్ర భయాందోళనలో ఆ అధికారులు..!

ట్రెండింగ్ వార్తలు