Nara Lokesh: కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు, వరుసగా ఢిల్లీ పర్యటనలు.. అసలు లోకేశ్ వ్యూహం ఏంటి?
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కేంద్ర పెద్దలను కలిసినప్పుడల్లా వారితో ఏం మాట్లాడుతున్నారు? (Nara Lokesh)

Nara Lokesh: టీడీపీలో ఆయనే నెంబర్ 2. ఆ మాటకొస్తే ఫ్యూచర్ లీడర్‌గా కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదెవరనే ప్రశ్న వస్తే..టక్కున గుర్తొచ్చే పేరు లోకేశ్. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న లోకేశ్..కేంద్ర పెద్దలతో దగ్గరి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా..భవిష్యత్ నేతగా లోకేశ్‌కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫున అన్నీ తానై ఢిల్లీ పెద్దల తలుపు తట్టి పనులు చక్కబెడుతున్నారు చిన్నబాబు. లోకేశ్ హస్తిన పర్యటనల వెనక ప్లానేంటి? ఏపీ అభివృద్ధి కోసం విజ్ఞప్తులు చేస్తూనే కేంద్ర పెద్దలతో ర్యాపో పెంచుకుంటున్నారా.?
టీడీపీ పార్టీ ఈవెంట్ అయినా..ప్రభుత్వ కార్యక్రమం అయినా..ఇన్వెస్టర్స్ మీట్ అయినా..కార్యక్రమం ఏదైనా ఆయన సెంట్రిక్‌గానే నడుస్తోంది. ఓవైపు మంత్రిగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే..ఇంకోవైపు పార్టీ బలోపేతం చేసే ప్లాన్ చేస్తున్నారు. సేమ్‌టైమ్ టీడీపీ ఫ్యూచర్ లీడర్‌గా ఎస్టాబ్లిస్ అవుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగా క్యాడర్, లీడర్లతో దగ్గరి సంబంధాలు మెయింటెన్ చేస్తూనే..తనదైన తన స్లైల్‌లో అపోజిషన్‌పై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ లైమ్‌లైట్‌లో ఉంటున్నారు లోకేశ్.
మరోవైపు కేంద్ర పెద్దలతోనే మంచి రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. బీజేపీ అ్రగనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు చిన్నబాబుకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. యువనేతగా, ఏపీ మంత్రిగా..చంద్రబాబు వారసుడిగా రాజకీయంగా భవిష్యత్ ఉన్న లీడర్‌గా లోకేశ్‌కు ఢిల్లీలో ప్రాధాన్యత పెరుగుకుంటూ వస్తోంది. గత ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడిపోయారు లోకేశ్. ఏకంగా ప్రధాని మోదీ ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేశ్‌కు చెప్పారంటే ఆయనకు ఏ రేంజ్‌లో ప్రాధాన్యత దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండటం వెనుక పెద్ద ప్లాన్..!
ఏపీ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా ఉన్న లోకేశ్..కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండటం వెనుక పెద్ద ప్లానే ఉంది. ఈ సంబంధాలు అటు బీజేపీకి..ఇటు లోకేశ్‌కు ఇద్దరికి అవసరమేనన్న చర్చ జరుగుతోంది. పాలిటిక్స్‌లో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న బాబు..గతంలో ఎన్డీయేలో కీలకంగా వ్యవహరించి కింగ్ మేకర్‌గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏడు పదుల వయసు దాటారు. అయినా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కానీ టీడీపీలో ఇక భవిష్యత్ అంతా లోకేశ్‌దే. పార్టీ పరంగా అయినా..బీజేపీతో సంబంధాల విషయంలో అయినా లోకేశే ముందుండి నడిపించడం ఖాయం.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే..ఆయన యాక్టీవ్‌గా కొనసాగుతూ..వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తూ..తన మార్క్ రాజకీయం చేయగలుగుతున్నప్పుడే లోకేశ్‌ను ఫుల్ యాక్టీవ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలతో లోకేశ్ వరుస సమావేశం అవుతున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.
సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ..పార్టీ తరఫున..ప్రభుత్వంలో తెరవెనుక ఉండి అన్నీ తానై నడిపిస్తున్నారు లోకేశ్. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో ఫాలో అప్ చేస్తున్నారు లోకేశ్. ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు.
మోదీ ఎప్పుడు ఏపీకి వచ్చినా..లోకేశ్‌ని ఢిల్లీకి వచ్చి కలవమంటూ ప్రత్యేకంగా చెబుతున్నారు. విశాఖ సభ వేదికగా లోకేశ్‌తో ప్రత్యేకంగా మాట్లాడి..ఢిల్లీ వచ్చి తనను కలవాలని సూచించారు మోదీ. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి మోదీతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు లోకేశ్. ఈ ఏడాది జూన్‌లో ఒకసారి, ఆగస్ట్‌లో మరోసారి ఢిల్లీ వెళ్లి వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పనులపై రిక్వెస్ట్‌లు పెట్టారు.
అప్పటి నుంచే అమిత్‌షాతో సన్నిహిత సంబంధాలు..!
లోకేశ్ అడిగిందే లేట్ అన్నట్లుగా కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే కాకుండా..ఆయన విజ్ఞప్తులపై వెంట వెంటనే ఫాలోప్ చేస్తున్నారట. అయితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఢిల్లీలో బేస్ ఏర్పాటు చేసుకున్నారట లోకేశ్. అప్పటి నుంచే కేంద్రమంత్రి అమిత్‌షాతో చిన్నబాబుకు సన్నిహిత సంబంధాలు మొదలయ్యాయని ఇన్‌సైడ్ టాక్.
కూటమి ఏర్పాటులో కూడా లోకేశ్ కీరోల్ ప్లే చేయడంతో పాటు..ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ సినారియోపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద జరుగుతున్న దర్యాప్తుపై కేంద్రమంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట. అన్నింటికి మంచి ఢిల్లీ, అమరావతి మధ్య బంధం మరింత బలపడేలా..అంతా సాఫీగా జరిగిపోయేలా లోకేశ్ దౌత్యం నడుపుతున్నారు.
ఇలాంటి సిచ్యువేషన్‌లో మరోసారి ఢిల్లీకి పర్యటన చేస్తున్నారు లోకేశ్. వైజాగ్‌లో నిర్వహించిన యోగాంధ్ర సక్సెస్‌పై రూపొందించిన పుస్తకాన్ని..ప్రధాని మోదీకి అందిస్తారు. ఏదైనా కేంద్ర పెద్దలతో లోకేశ్ భేటీల వెనుక ఫ్యూచర్ ప్లాన్ అయితే పక్కా ఉండే ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
Also Read: అందరికీ ఆరోగ్య బీమా.. 25 లక్షల వరకు ఉచిత వైద్యం.. ఇంకా.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు