Google Pixel 9 Pro Fold : ఏంటి భయ్యా ఈ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్.. ఇప్పుడే కొనడం బెటర్..!

Google Pixel 9 Pro Fold : గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మడతబెట్టే ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలంటే?

1/6Google Pixel 9 Pro Fold
Google Pixel 9 Pro Fold : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగుస్తోంది. ఈ సేల్ చివరి రోజున గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మడతబెట్టే ఫోన్ సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
2/6Google Pixel 9 Pro Fold
పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్ అందించే అనేక ఆఫర్లలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఒకటి. ఈ ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 68వేల వరకు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
3/6Google Pixel 9 Pro Fold
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ రూ.1,72,999కు లాంచ్ అయింది. ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,14,999కు లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర కన్నా రూ.58వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4/6Google Pixel 9 Pro Fold
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 1080×2424 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. లోపల ఫోన్ 8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ఫోల్డింగ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది.
5/6Google Pixel 9 Pro Fold
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4650mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, మ్యాజిక్ లిస్ట్, పిక్సెల్ స్టూడియో, క్లియర్ కాలింగ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడా వస్తుంది.
6/6Google Pixel 9 Pro Fold
కెమెరాల విషయానికొస్తే.. ఈ పిక్సెల్ 9 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో 48MP మెయిన్ సెన్సార్, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం లోపలి, బయటి డిస్‌ప్లేలు రెండూ 10MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉన్నాయి.