పిన్నెల్లిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు.. ఈసీ, పోలీసులకు కీలక ఆదేశాలు

కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. మాచర్లకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రంలోనే జూన్ 6వ తేదీ వరకు ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. కేసు విషయంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అటు పిన్నెల్లి కదలికలపై నిఘా పెట్టాలని సీఈవో, పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయకూడదని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో పిన్నెల్లిపై కొన్ని షరతులు విధించింది ఏపీ హైకోర్టు. పిన్నెల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ మాచర్లకు వెళ్లొకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ నియోజకవర్గం అంటే నరసరావుపేటలో మాత్రమే ఉండాలి.

జూన్ 6వ తేదీ వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది కోర్టు. ఈ విషయంలో మీడియాతో మాట్లాడటం కానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సాక్ష్యులను ప్రభావం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. వారితో మాట్లాడొద్దని ఆదేశాలిచ్చింది. ఇక పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని ఎన్నికల అధికారికి, పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

కాగా, ఈవీఎం విధ్వంసం కేసులో తన కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లిపై జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఏపీలో పోలింగ్ హింసపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు