Huzurabad By Election : నన్ను పోలింగ్ కేంద్రానికి వెళ్లొద్దు అనటానికి బీజేపీ నేతలు ఎవరు : కౌశిక్ రెడ్డి

హజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఈక్రమంలో పోలింగ్ కేంద్రానికి వెళుతున్న టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ అడ్డుకోవటంతో ఆయన మండిపడ్డారు.

Huzurabad By Election 2021: ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన హుజూరాబాద్‌ పోలింగ్‌లో ఉద్రిక్త‌త నెలకొంది. బీజేపీ,టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది.టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఘనుముక్కలోని పోలింగ్ కేంద్రానికి రావటంతో అతనిని బీజేపీ నేత‌లు నిలదీశారు. దీంతో కౌశిక్‌ రెడ్డికి పోలీసులు నిలిచారు. దీంతో బీజేపీ నేతలు కౌశిక్ రెడ్డిఅధికారపార్టికి చెందిన వ్యక్తికాబట్టి పోలిసులు రక్షణ కల్పిస్తున్నారని..ఓ పక్కన పోలింగ్ కొనసాగుతుంటే మరోపక్క కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తు హల్ చల్ చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో కౌశిక్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా..‘నన్ను పోలింగ్ కేంద్రానికి రావద్దు అనటానికి బీజేపీ నేతలు ఎవరు?నేనేమీ అక్రమంగా..దౌర్జన్యంగా వెళ్లలేదు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పోలింగ్ కేంద్రానికి వెళ్లే హక్కు నాకుండా నన్ను అడ్డుకోవటానికి బీజేపీ నేతలకేమి హక్కు ఉంది?అంటూ కౌశిక్ రెడ్డి ఐడీ కార్డు చూపించారు. ఓటర్లు టీఆర్ఎస్ తరపున నిలబడి ఓట్లు వేస్తున్నారని బీజేపీ నేతలు ఓర్చుకోలేక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని..ఘనుముక్కలలో బీజేపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read more : Huzurabad By Election : హుజూరాబాద్ ఉపఎన్నిక..డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు..

కాగా..హుజూరాబాద్ ఉప ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరుపార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఈక్రమంలో ఉప ఎన్నికకు సంబంధించిన‌ పోలింగ్ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య కొన‌సాగుతోంది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్య‌క‌ర్త‌లు ఘర్షణ ప‌డుతున్నారు. ఈక్రమంలో టీఆర్ఎస్ శ్రేణుల‌తో క‌లిసి ఘ‌న్ముక్ల‌కు కౌశిక్ రెడ్డి రావటంతో బీజేపీ నేత‌లు..ప‌దేప‌దే ఘ‌న్ముక్ల‌కు ఎందుకు వ‌స్తున్నారంటూ కౌశిక్‌రెడ్డిని బీజేపీ నేత‌లు నిల‌దీశారు. కౌశిక్ రెడ్డి దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ బీజేపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్‌నంటూ కౌశిక్ రెడ్డి ఐడీ కార్డు చూపుతు.. త‌న‌కు 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కిడికైనా వెళ్లే హ‌క్కు ఉంద‌ని కౌశిక్ రెడ్డి స్పష్టంచేశారు. మీరు ఆపేస్తే నేను ఆగిది లేదని..ఓడిపోతామని ముందే తెలుసుకుని బీజేపీ నేత‌లు ఫ్ర‌స్టేష‌న్ కు గురవుతు నన్ను అడ్డుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

Read more :Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు 

కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్య‌క‌ర్త‌లు చుట్టుముడుతుండ‌డంతో ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా పోలీసు సిబ్బంది నిలిచారు. అనంత‌రం కౌశిక్ రెడ్డికి పోలీసులు స‌ర్దిచెప్ప‌డంతో పోలింగ్ కేంద్రం నుంచి కౌశిక్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. అలాగే జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం అల‌జ‌డి రేపింది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆరోపించారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్ వ‌ద్ద స్థానికేతరులు ఎందుకు ఉన్నార‌ని బీజేపీ నేతలు నిల‌దీశారు. ఇలా ప‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ వాతావరణం నడుమ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ రాత్రి ఏడు గంటలవరకు కొనసాగనుంది.

ట్రెండింగ్ వార్తలు