Shirdi Saibaba Temple : షిర్డికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న టూరిజం శాఖ

కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో  భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.

Shirdi Saibaba Temple :  కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో  భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు. దీంతో తెలంగాణ పర్యాటక శాఖ  సాయి భక్తుల కోసం ప్రత్యేక  బస్సులు నడుపుతోంది.  హైదరాబాద్‌ నుంచి షిర్డీకి ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు బేగంపేటలోని టూరిజంప్లాజా నుంచి ప్రత్యేక బస్సు బయలు దేరుతుంది.

వెళ్లేటప్పుడు శనిసింగనాపూర్‌, వచ్చేటప్పుడు అజంతా ఎల్లోరాను సందర్శించేలా టూర్‌ రూపొందించారు. షిర్డీలో ఒక రాత్రి బస ఏర్పాటుచేస్తారు. మూడ్రోజుల పాటు సాగే ఈ టూర్‌కు పెద్దలు రూ.3,250,  పిల్లలు రూ.2,060 చెల్లించాలి. కాగా…. షిర్డీలో సాయిబాబా దర్శనం టికెట్లను ఎవరికివారే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని టీఎస్‌టీడీసీ ఎండీ తెలిపారు. ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, ఫొటో గుర్తింపు కార్డు అడుగుతున్నందున టీఎస్‌టీడీసీ తరఫున దర్శనం టికెట్లు బుక్‌చేయడం లేదని పేర్కొన్నారు.

Also Read : Telangana Rains: మళ్ళీ కుండపోత.. నేడు కూడా భారీ వర్షాలు!

ట్రెండింగ్ వార్తలు