Kevvu Kartheek : జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Kevvu Kartheek : మిమిక్రీతో కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ గా ఎదిగి కెవ్వు కార్తీక్ గా బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా, పలు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కొన్నాళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాడు కార్తీక్. తాజాగా కెవ్వు కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

కెవ్వు కార్తీక్ తల్లి మరణించినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపాడు. కెవ్వు కార్తీక్ తల్లి దాదాపు అయిదేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతుంది. గతంలో కూడా పలు టీవీ షోలలో ఈ విషయాన్ని కార్తీక్ చెప్పాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చుపెట్టినట్టు, అమ్మ పక్కనే ఉండి చూసుకుంటున్నట్టు తెలిపాడు. అయిదేళ్లుగా క్యాన్సర్ తో పోరాటం చేసిన కెవ్వు కార్తీక్ తల్లి నిన్న రాత్రి మరణించింది. దీంతో కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read : Janhvi Kapoor : పాపం జాన్వీ.. రెండు భుజాలకు గాయాలు అయినా.. రెండేళ్లు ఆ సినిమా కోసం..

కెవ్వు కార్తీక్ తన తల్లి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అమ్మ గత 5సంవత్సరాల 2 నెలలుగా కాన్సర్ కూడా భయపడే విధంగా కాన్సర్ పై అలుపెరుగని పోరాటం చేసావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు, నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్ట పరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడవు. అమ్మ ఈ 5 సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు. నీ ఆత్మ స్థైర్యం నాలో ధైర్యాన్ని నిపింది. అన్ని నేర్పవు కానీ నువ్వు లేకుండాఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. పలువురు టీవీ సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, నెటిజన్లు కెవ్వు కార్తీక్ తల్లికి నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు