Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగస్టుకి ‘ఫౌజీ’ షూటింగ్ ఫినిష్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ 'ఫౌజీ(Fauzi)' మూవీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
prabahs fauzi movie shooting and release update
- చివరి దశకు ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్
- రిలీజ్ డేట్ పై క్లారిటీకి వచ్చేసిన మేకర్స్
- ఆగస్టు 15కి ‘ఫౌజీ’ నుంచి అధికారిక అప్డేట్
Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ(Fauzi)’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, అణచివేతకు గురైన ఒక సమాజం నుండి ఉద్భవించిన వీరుడి కథగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో ప్రభాస్ ఆర్మీ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తనదైన శైలిలో ఎమోషన్స్‌ను పండిస్తూనే, యుద్ధ సెన్నివేశాలను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నాటికి పూర్తిగా ముగించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ సెట్లను నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Sunny Leone: చీరలో బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్.. స్టన్నింగ్ ఫోటోలు వైరల్
ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ పెద్ద సినిమాల వసూళ్లకు కలిసొచ్చే సమయం కావడంతో, ఆ లోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు హను రాఘవపూడి మార్క్ పోయెటిక్ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
