Janhvi Kapoor : పాపం జాన్వీ.. రెండు భుజాలకు గాయాలు అయినా.. రెండేళ్లు ఆ సినిమా కోసం..

జాన్వీ కపూర్ మిస్టర్ & మిసెస్ మహి షూటింగ్ లో పడ్డ కష్టాలు తెలిపింది.

Janhvi Kapoor : పాపం జాన్వీ.. రెండు భుజాలకు గాయాలు అయినా.. రెండేళ్లు ఆ సినిమా కోసం..

Janhvi Kapoor Injured while Mr and Mrs Mahi Movie Shooting

Janhvi Kapoor : బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో జాన్వీ కపూర్ మిస్టర్ & మిసెస్ మహి సినిమాతో రాబోతుంది. అపూర్వ మెహతా, కరణ్ శర్మ నిర్మాణంలో శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ జంటగా మిస్టర్ & మిసెస్ మహి సినిమా తెరకెక్కింది.

క్రికెట్ అంటే ఇష్టం ఉన్న భార్యాభర్తల్లో క్రికెటర్ అవ్వాలనుకొని కాలేకపోయిన భర్త, భార్యని ఎలా క్రికెటర్ చేసాడు అనే కథాంశంతో ఈ మిస్టర్ & మిసెస్ మహి సినిమా తెరకెక్కింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచారు. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కేవలం హిందీలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో మిస్టర్ & మిసెస్ మహి షూటింగ్ లో పడ్డ కష్టాలు తెలిపింది జాన్వీ.

Also Read : Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది? చేతికి కట్టుతో ఎయిర్ పోర్ట్‌లో కనపడిన ఐశ్వర్య రాయ్..

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. మిస్టర్ & మిసెస్ మహి సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాను. నాకు క్రికెట్ మీద అంత అవగాహన లేదు. అలాంటిది నన్ను పూర్తి క్రికెటర్ గా మార్చడానికి నా కోచ్ లు చాలా కష్టపడ్డారు. క్రికెట్ కోచింగ్ సమయంలో, ఈ సినిమా క్రికెట్ చిత్రీకరణ సన్నివేశాల్లో నాకు ఎన్నో గాయాలయ్యాయి. నా భుజాలకు కూడా గాయాలు అయ్యాయి. అసలు నా రెండు భుజాలు పనిచేయవేమో అనుకున్నాను. చాలా సార్లు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నాను. కానీ కష్టమైనా ఈ సినిమా చేశాను, ఆ సమయంలో మూవీ యూనిట్ నాకు చాలా సపోర్ట్ చేశారు అని తెలిపింది.

జాన్వీ ఇప్పటివరకు పలు సినిమాలతో నటిగా మెప్పించినా ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోలేదు. మరి ఈ సినిమాతో అయినా కమర్షియల్ హిట్ కొడుతుందా? లేక దేవర సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకుంటుందా చూడాలి.