Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది? చేతికి కట్టుతో ఎయిర్ పోర్ట్‌లో కనపడిన ఐశ్వర్య రాయ్..

ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్తూ కనపడింది.

Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది? చేతికి కట్టుతో ఎయిర్ పోర్ట్‌లో కనపడిన ఐశ్వర్య రాయ్..

Aishwarya Rai Appearance in Mumbai Airport with Hand Injury Photos and Video goes Viral

Updated On : May 16, 2024 / 9:48 AM IST

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది. కానీ పలు సినిమా ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటుంది. గత సంవత్సరం పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఇటీవల ఐశ్వర్య ఎక్కడ కనపడినా తన కూతురు ఆరాధ్యతో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఫ్రాన్స్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ కి దేశవిదేశాల నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరవుతారు. ఐశ్వర్య రాయ్ కూడా ఇండియా తరపున ప్రతి సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరవుతుంది. తాజాగా నిన్న రాత్రి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్తూ కనపడింది.

Also Read : Pushpa Steps : ముంబై లోకల్ ట్రైన్‌లో నైజీరియన్ అబ్బాయి పుష్ప స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..

అయితే ఐశ్వర్య రాయ్ చేతికి గాయం అయి కట్టు కట్టి ఉంది. చేతికి పెద్ద దెబ్బ తగలడం లేదా ఫ్రాక్చర్ అయితే వేసే కట్టు లాంటిది కట్టి ఉంది ఐశ్వర్య రాయ్ చేతికి. దీంతో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వసాగాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది, ఇలా చేతికి కట్టుతోనే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చేతికి ఏమైంది అనేది ఐశ్వర్య రాయ్ మాత్రం తెలపలేదు.