RBI Assistant 2026 Recruitment : RBIలో 650 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి మరి కొన్ని గంటలే ఉంది.. త్వరపడండి
RBI Assistant 2026 Recruitment : ఆర్బీఐలో 650 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నేడే చివరి రోజు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరపడండి
RBI Assistant 2026 Recruitment Last Day to Apply 650 post on 8th march
RBI Assistant 2026 Recruitment : భుత్వ ఉద్యోగాలు అందునా బ్యాంకు జాబ్స్ కోసం ఎదురు చూసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 650 పోస్టులను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. బ్యాంకు జాబుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 8, 2026 చివరి తేదీ. అంటే మరి కొన్ని గంటల్లోనే దరఖాస్తు ప్రాసెస్ ముగియనుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే.. వెంటనే చేసుకుంటే మంచిది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్బీఐ దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల్లో ఉన్న RBI కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు.. ఆయా ప్రాంతీయ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ 650 పోస్టుల్లో ఎక్కువ ఖాళీలు ముంబై కార్యాలయంలోనే ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
- ముంబై – 249
- చెన్నై – 53
- కాన్పూర్ – 50
- లఖ్నవూ – 50
- న్యూఢిల్లీ – 49
- గువాహటి – 36
- భోపాల్ – 30
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం హైదరాబాద్ కార్యాలయంలో 11 ఖాళీలు కేటాయించారు. ఈ నగరాలతో పాటు తిరువనంతపురం, పట్నా, జైపూర్, బెంగళూరు కోల్కతా, అహ్మదాబాద్, చండీగఢ్, భువనేశ్వర్, నాగ్పూర్, జమ్మూ నగరాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనుంది.
విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, వర్డ్ ప్రాసెసింగ్ నైపుణ్యం తప్పనిసరి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ప్రాంతానికి సంబంధించి.. అక్కడి స్థానిక భాషలో చదవడం, మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి.
వయస్సు పరిమితి..
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమినరీ పరీక్ష: దీనిలో భాగంగా అభ్యర్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాలపై ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో పరీక్ష నిర్వహిస్తారు.
- మెయిన్స్ పరీక్ష: రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT): అభ్యర్థులు దరఖాస్తు చేసిన ప్రాంతానికి సంబంధించిన భాషలో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
చివరకు మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అయితే భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.
జీతం, ఇతర ప్రయోజనాలు..
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,514 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఏపీ, తెలంగాణలోని పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పట్టణాలతో పాటు ఏపీలో विजयవాడ, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం..
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు
- సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 450 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 50 ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు గడువు.. ఫిబ్రవరి 16, 2026 నుంచి మార్చి 8, 2026
- ప్రిలిమినరీ పరీక్ష: ఏప్రిల్ 11 (తాత్కాలికంగా)
- మెయిన్స్ పరీక్ష: జూన్ 7 (తాత్కాలికంగా)
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం RBI అధికారిక వెబ్సైట్ https://opportunities.rbi.org.in/ ను సందర్శించవచ్చు.
