Taapsee Pannu: ఆ హీరో రిజెక్ట్ చేయడం బాధకలిగించింది.. ఒక సినిమా చేశాక కూడా ఆలా చేస్తాడని అనుకోలేదు
స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి పన్ను(Taapsee Pannu).
Taapsee Pannu Makes Shocking Comments About Star Heroes
- స్టార్ బ్యూటీ తాప్సి షాకింగ్ కామెంట్స్
- స్టార్ హీరో తనను రిజెక్ట్ చేశాడంటూ ఆవేదన
- తనతో అప్పటికే రెండు సినిమాలు చేశాడట ఆ హీరో
Taapsee Pannu: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్ను(Taapsee Pannu). గతంలో ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో ఉన్న పురుషాధిక్యతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి అగ్ర హీరోలు సైతం వెనకాడుతుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒక చిత్రంలో తాను డబుల్ రోల్ చేస్తున్న సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.
Peddi: ఒకరు కాదు ఇద్దరు స్టార్స్.. పెద్ది స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా.. బుచ్చిబాబు మామూలోడు కాదు
ఆ సినిమాలో హీరో పాత్ర మేకర్స్ ఒక ప్రముఖ స్టార్‌ను సంప్రదించారు. హీరోయిన్‌కు ఎక్కువ మార్కులు పడతాయనే అభద్రతా భావంతో ఆయన ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు అని తాప్సీ వెల్లడించారు. ఆ హీరో గతంలో తనతో కలిసి నటించిన అనుభవం ఉన్నప్పటికీ, కేవలం పాత్ర నిడివి, ప్రాధాన్యత విషయంలో భయపడి సదరు హీరో వెనక్కి తగ్గడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
కేవలం పెద్ద స్టార్లే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసిన కుర్ర హీరోలు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఇష్టపడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రశంసలు కేవలం హీరోయిన్ పాత్రకే దక్కుతాయనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుందని తాప్సీ విశ్లేషించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, బలమైన కథాంశాలతో దూసుకుపోతున్న తాప్సీ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో సమానత్వం గురించి ఆమె మాట్లాడటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
