రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి.. కోహ్లీ ఏమన్నారంటే..

సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్ అద్భుతంగా సాగింది. 39ఏళ్ల ఛెత్రి భారత్ తరపున 145 మ్యాచ్ లు ఆడారు. తన 20ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ..

Indian football legend Sunil Chhetri

Sunil Chhetri Retirement : భారత్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్, లెజెండ్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు దాదాపు తొమ్మిది నిమిషాల నిడివి కలిగిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్యాప్షన్ లో.. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని సునీల్ ఛెత్రి పేర్కొన్నాడు. ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ లో కువైట్ తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడతానని చెప్పాడు. భారత్ – కువైట్ మధ్య జూన్ 6న ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్‌ గ్రూప్‌-ఎలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలోఉన్న ఖతార్‌ కంటే వెనుకబడి ఉంది.

Also Read : IPL 2024 : రాజస్థాన్ జట్టుకు ఏమైంది.. ఇలాఅయితే ఫైనల్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవటమే!

సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్ అద్భుతంగా సాగింది. భారత్ తరపున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. 39ఏళ్ల ఛెత్రి భారత్ తరపున 145 మ్యాచ్ లు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 94 గోల్స్ చేశాడు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టీవ్ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ఆటగాడు ఛెత్రి. అతడికంటే ముందు క్రిస్టియానో రొనాల్డ్ (128), లియోనిల్ మెస్సి (106) ఉన్నారు. భారత్ తరపున ఛెత్రినే టాప్ స్కోరర్. ఛెత్రీ రిటైర్మెంట్ ప్రకటన తరువాత భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నా బ్రదర్ అనిఅన్నారు.

Also Read : బాలికపై అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు ఊరట.. ఎనిమిదేళ్ల జైలు శిక్ష రద్దు

సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. రిటైర్మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు. తన అరంగేట్రం మ్యాచ్ ను గుర్తుచేసుకొని, మొదటి మ్యాచ్ లో కోచ్ గురించి ప్రస్తావించారు. తన అరంగేట్రం మ్యాచ్ లో ఎదురైన అనుభవాలను సునీల్ ఛెత్రి వీడియోలో పంచుకున్నారు. ఆ మ్యాచ్ లోనే తొలి గోల్ సాధించాను. ముఖ్యంగా నేను టీమిండియా జెర్సీని ధరించినప్పుడు అది భిన్నమైన అనుభూతిని కలిగించింది. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. 19ఏళ్లలో నాకు గుర్తున్నవి బాధ్యతలు, ఒత్తిడి, అపారమైన ఆనందం. వ్యక్తిగతంగా ఇది దేశంకోసం ఆడిన ఆట అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను జాతీయ జట్టుతో శిక్షణ పొందినప్పుడల్లా ఆనందిస్తానని అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తనను ప్రోత్సహించిన, అండగా నిలిచిన వారికి, నా అభిమానులకు ఛెత్రి కృతజ్ఙతలు చెప్పాడు. సునీల్ ఛెత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు