Alaya F : మా నాన్న రెండో పెళ్ళికి కూడా మా అమ్మ వెళ్ళింది.. పేరెంట్స్ పై బాలీవుడ్ భామ ఆసక్తికర వ్యాఖ్యలు..

బాలీవుడ్ భామ అలయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపింది.

Bollywood Actress Alaya F Talking about her Parents Pooja Bedi and Farhan

Alaya F : బాలీవుడ్ భామ అలయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒకప్పటి నటి పూజా బేడి కూతురే అలయ. ప్రస్తుతం అలయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇక పూజా బేడి ప్రస్తుతం టీవీ షోలతో అలరిస్తుంది. పూజ బేడి ప్రముఖ వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాని 1994లో పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2003లో విడాకులు తీసుకున్నారు. అనంతరం పూజా బేడి మళ్ళీ పెళ్లి చేసుకోకపోయినా ఫర్హాన్ మాత్రం మరో నటి లైలా ఖాన్ ని పెళ్లి చేసుకున్నాడు.

Also Read : Janhvi Kapoor : పాపం జాన్వీ.. రెండు భుజాలకు గాయాలు అయినా.. రెండేళ్లు ఆ సినిమా కోసం..

తాజాగా అలయ ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ.. నా చిన్నప్పుడే మా పేరెంట్స్ విడిపోయినా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. మా నాన్న రెండో పెళ్ళికి కూడా మా అమ్మ వెళ్ళింది. ఇప్పుడు మా నాన్నకి పుట్టిన పిల్లలతో కూడా నా బ్రదర్స్ లా క్లోజ్ గా ఉంటాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. మా నాన్న రెండో భార్యతో కూడా నేను చాలా క్లోజ్ గా ఉంటాను. మా అమ్మ నాన్న విడిపోయినా వాళ్ళిద్దరి జీవితాలతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అని తెలిపింది. దీంతో అలయ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.