Vakeel Saab: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో మరోసారి నిరూపితమైంది. మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరమీదకి వచ్చిన తమ హీరోకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతున్నా వకీల్ సాబ్ కోసం థియేటర్స్ కు క్యూ కట్టడం మాత్రం ఆగడం లేదు. ఒరిజినల్ పింక్ కథకు.. పవన్ రేంజ్ టచ్ ఇచ్చిన వదిలిన వకీల్ సాబ్ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. పవర్ స్టార్ ఆవేశమే సినిమాకు ప్లస్ కాగా.. టోటల్ సినిమాలో నచ్చని అంశం ఏదైనా ఉందంటే పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే.

ఒరిజినల్ కథలో లేని ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వకీల్ సాబ్ కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ అరువు తెచ్చుకున్నాడు. కానీ తెచ్చిన ఆ ఎపిసోడ్ ను సరిగ్గా డీల్ చేయలేదన్నది విశ్లేషకులు సినిమా విడుదల రోజే తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా ఆ ఎపిసోడ్ లో పవన్ – శృతి హాసన్ డ్రెస్సింగ్ నుండి కెమిస్ట్రీ వరకు ఏదీ సెట్ కాలేదని వినిపించింది. శృతిహాసన్ అయితే లుక్ పరంగా దారుణంగా కనిపించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లోనే వినసొంపైన కంటి పాప సాంగ్ ఉన్నా అది కూడా ఉత్కంఠగా సాగే కథకు బ్రేకులు వేసేలా ఉందని వినిపించింది.

దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ప్లీజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయరూ అనే వేడ్కోలు అభిమానుల నుండి వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం లేదని కానీ ఆ ఎపిసోడ్ వలనే సినిమా మీద కాస్త ఇంప్రెషన్ తగ్గుతుందని అభిమానులు వాపోతున్నారు. కానీ ఆ ఎపిసోడ్ తోనే సినిమాలో కీలకమైన ట్విస్టుకు లింక్ చేశాడు దర్శకుడు. దీంతో ఆ ఎపిసోడ్ ట్రిమ్ చేయాలంటే కథతో లింక్ తెగిపోతుంది. కానీ అభిమానులు మాత్రం నిర్మాత దిల్ రాజు ట్యాగ్ చేస్తూ కత్తెరకు పనిచెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి దర్శక, నిర్మాతలు అభిమానుల మొర ఆలకించి ఏమైనా రీ ఎడిటింగ్ చేస్తారా అన్నది డౌటే!

Read:Vakeel Saab Release: ఏప్రిల్ నెలలో వస్తున్న పవన్ 7వ సినిమా.. ఇంకా ప్రత్యేకతలు ఇవే!

ట్రెండింగ్ వార్తలు