Rahul Dravid : ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్న రాహుల్ ద్ర‌విడ్‌.. ఓటు వేసేందుకు సామ్యానుడిలా క్యూలో నిల‌బ‌డి..

టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఓ సామాన్యుడిలా క్యూలో నిల‌బ‌డి మ‌రీ త‌న వంతు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేసి ఓటేశాడు.

Rahul Dravid casts his vote : దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల రెండో ద‌శ పోలింగ్ కొన‌సాగుతోంది. ఇక క‌ర్ణాట‌క‌లోని 14 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభ‌మైంది. ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ప్ర‌జ‌లు పోలింగ్ బూత్‌ల‌కు పోటెత్తారు. కొంద‌రు సెల‌బ్రెటీలు సైతం ఉద‌యాన్నే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఓ సామాన్యుడిలా క్యూలో నిల‌బ‌డి మ‌రీ త‌న వంతు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేసి ఓటేశాడు.

ఓటు హ‌క్కును వినియోగించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడాడు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు. ప్ర‌జాస్వామ్యంలో మ‌న‌కు ల‌భించే గొప్ప అవ‌కాశం ఇది అన్నారు. ద్ర‌విడ్ మాజీ స‌హ‌చ‌రుడు, దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే సైతం బెంగ‌ళూరులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. కాగా.. ద్ర‌విడ్ క్యూలో నిలుచున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

IPL Tickets : ఐపీఎల్ టికెట్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల అరెస్టు..

క‌ర్ణాట‌క‌లో మొత్తం 28 లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయి. ఇందులో 14 స్థానాలు ఉడిపి చికమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుంకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్‌ల‌లో శుక్ర‌వారం పోలింగ్ జ‌రుగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించింది. 2019లో రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 25 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి బీజేపీ 25 స్థానాల్లో మిత్ర‌ప‌క్షం జేడీఎస్‌కు మూడు సీట్లలో పోటి చేస్తోంది.

Pat Cummins : ఆర్‌సీబీ పై హైద‌రాబాద్ ఓట‌మి.. కెప్టెన్ క‌మిన్స్ కీల‌క వ్యాఖ్య‌లు

ట్రెండింగ్ వార్తలు