Avengers Endgame – Kalki 2898 AD : ‘ఎండ్ గేమ్’కి ఐదేళ్లు.. కల్కిలో అలాంటి గూస్బంప్స్ ఎండింగ్ కోసం..
అవెంజర్స్ 'ఎండ్ గేమ్' రిలీజ్ కి ఐదేళ్లు పూర్తి అయ్యింది. దీంతో సోషల్ మీడియా అంతా..
- gum 95921
- Updated on- April 26, 2024 / 12:00 PM IST
Avengers Endgame complete 5 years trending with Kalki 2898 AD
Avengers Endgame – Kalki 2898 AD : అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజయ్యి ఈరోజుతో (ఏప్రిల్ 26) ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ అంతా మరోసారి రిలీజ్ డేస్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఇన్ఫినిటీ వార్ సినిమాతో ఎండ్ గేమ్ రిలీజ్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్కి.. అంతకుమించి కంటెంట్ కనిపించడంతో గూస్బంప్స్ ఫీల్ అయ్యారు.
ముఖ్యంగా లాస్ట్ వార్ సీన్ అయితే ప్రతి ఒక్క ఆడియెన్ ని సీట్ ఎడ్జిలో కూర్చునేలా చేసింది. విజుల్ వేయించింది. ఇక యుద్ధం ముగింపుని ఐరన్ మెన్ మరణంతో చూపించి.. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఎమోషనల్ చేసారు. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కూడా ఎమోషనల్ చేసి కన్నీరు పెట్టిస్తాయా అనే ప్రశ్నకి.. బెస్ట్ ఆన్సర్ గా ఎండ్ గేమ్ నిలిచింది. ఈ సినిమా తరువాత మార్వెల్ నుంచి హాలీవుడ్ ఇతర యూనివెర్సలు నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా.. ఈ చిత్రం ఇచ్చిన గూస్బంప్స్ మరేది ఇవ్వలేదు.
Also read : The 100 Teaser : మరోసారి పోలీసుగా ఆర్కే నాయుడు.. జనసేనాని తల్లి చేతులు మీదుగా మూవీ టీజర్ లాంచ్..
అందుకనే ఆడియన్స్ ఇప్పటికీ ఈ సినిమాని ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరహాలోనే ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ రాబోతుంది. ఇండియన్ పురాణాల్లోని సూపర్ హీరోలు అందరూ కలిసి ఈవిల్ పై పోరాడబోతున్నారు. ఈ మూవీ పై ఇండియన్ ఆడియన్స్ లో భారీ క్రేజ్ ఉంది. ఇక ఈ ఆసక్తితోనే.. కల్కిలో ఎండ్ గేమ్ లాంటి ఎండింగ్ ఉంటే గూస్బంప్స్ పక్కా అంటూ తమ ఆశని తెలియజేస్తున్నారు.
ఇక ఆడియన్స్ లో ఉన్న ఈ అంచనాలకు తగ్గట్లే నాగ్ అశ్విన్ కూడా సినిమాని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. మహాభారతాన్ని లింక్ చేస్తూ సప్త చిరంజీవులను ఇప్పటి జనరేషన్ వాళ్ళకి సూపర్ హీరోలగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కల్కి ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందో లేదా ఎండ్ గేమ్ లా మించి ఉంటుందో చూడాలి.
