The 100 Teaser : మరోసారి పోలీసుగా ఆర్కే నాయుడు.. జనసేనాని తల్లి చేతులు మీదుగా మూవీ టీజర్ లాంచ్..
మరోసారి పోలీసుగా కనిపించబోతున్న ఆర్కే నాయుడు. తన కొత్త మూవీ 'ది100' టీజర్ ని జనసేనాని తల్లి అంజనాదేవి లాంచ్ చేసారు.

RK Sagar The100 Movie Teaser released by Pawan Kalyan Mother AnjanaDevi
The 100 Teaser : తెలుగు నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు.. చాలా గ్యాప్ తరువాత తన కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ‘మొగలిరేకులు’ సీరియల్ తో ఈ నటుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫేమ్ ని సంపాదించుకున్నారో సపరేట్ గా చెప్పనవసరం లేదు. దీంతో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో ‘సిద్దార్థ’ సినిమాతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఆ తరువాత రెండేళ్లకు ‘మాన్ ఆఫ్ ది మ్యాచ్’ చేసారు. ఇక మూడో సినిమా చేయడం కోసం మూడేళ్లు సమయం పట్టింది. ‘షాదీ ముబారక్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తరువాత మళ్ళీ మూడేళ్లకు ఇప్పుడు ‘ది100’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో సాగర్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు.
Also read : Mrunal Thakur : ఆ హీరోని కొట్టడానికి భయపడ్డాను అంటున్న మృణాల్.. ఎవరు ఆ హీరో..?
‘మొగలిరేకులు’ సీరియల్ లో సాగర్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషించే ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి పోలీసుగా కనిపించి ఆడియన్స్ ని మెప్పించడం కోసం ట్రై చేస్తున్నారు. ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ టీజర్ ని నేడు రిలీజ్ చేసారు. చిరంజీవి తల్లి అంజనాదేవి చేతులు మీదుగా ఈ టీజర్ ని లాంచ్ చేసారు. సాగర్ ఇటీవలే జనసేనలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జనసేన తరుపు నుంచి ఏపీలో కాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఈ బంధంతోనే ఈ మూవీ టీజర్ ని అంజనాదేవి ద్వారా లాంచ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక టీజర్ చూస్తుంటే ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగానే ఉంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మిష నారంగ్, ధన్య బాలకృష్ణ, గిరిధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.