గత పాలకులు సాధ్యం కాదన్నది నేను సుసాధ్యం చేశాను: కేశినేని నాని

Kesineni Nani: ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. తాను ఎంపీని అయ్యాకే విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.

గత పాలకులు సాధ్యం కాదన్నది నేను సుసాధ్యం చేశానని అన్నారు వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. కనకదుర్గ ఆలయం వద్ద ఫ్లైఓవర్ తీసుకొచ్చానని తెలిపారు. విజయవాడలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చానని చెప్పారు. విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. తాను ఎంపీని అయ్యాకే విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.

చంద్రబాబు, లోకేశ్ కలిసి ఇంట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని కేశినేని నాని విమర్శించారు. కేశినేని ట్రావెల్స్ మూయడానికి కారణం లోకేశ్ అని తెలిపారు. అక్రమాలు చేసేవాళ్లకే తానంటే పడదని చెప్పారు. సీనియర్లు టీడీపీని వీడడానికి కారణం లోకేశ్ అని అన్నారు. స్ట్రాంగ్ లీడర్స్ ను చూస్తే లోకేశ్ కు భయమని తెలిపారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని వర్గాల ఓటర్ల మద్దతు తనకే ఉందని కేశినేని నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 50 శాతం ఓట్లు తనకే వస్తాయని అన్నారు. విజయవాడ, గుంటూరును పాత నగరాల్లాగే ఉంచి, అమరావతిలోని ఆ 29 గ్రామాలను రియల్‌ ఎస్టేట్‌గా మార్కెట్‌ చేసుకోవాలని చంద్రబాబు ప్లాన్‌ వేసుకున్నారని చెప్పారు. రాజధాని అంశంలో బాబు తప్పు చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి పెట్టకండి, నష్టపోతారని తమ వాళ్లను హెచ్చరించానని అన్నారు. 50 ఏళ్లకు కూడా విజయవాడ నగరంగా డెవలప్‌ అవదని చెప్పానని తెలిపారు.

విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన కేశినేని నాని.. ఈ పదేళ్లలో సాధించిన విజయాలేంటో చెప్పారు. టీడీపీలో ఇమడలేకపోయారా? వారే పొగబెట్టారా? అన్న వివరాలు తెలిపారు.  సొంత తమ్ముడిపైనే పోటీ చేయాల్సివచ్చింది. ఈ పరిస్థితి ఎప్పుడైనా ఊహించారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. వైసీపీలో చేరిన ఒక్కరోజులోనే ఎంపీ టికెట్‌ రావడం, వైసీపీలో అందరూ సహకరిస్తున్నారా? కొత్తగా చేరి వెంటనే ఎన్నికలకు వెళ్లడం ఇబ్బంది అనిపించడం లేదా? అన్న విషయాలపై వివరాలు తెలిపారు.

Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రెండింగ్ వార్తలు